Cmrf cheques-distributed” నిరుపేదల వైద్యానికి సర్కార్ తోడ్పాటు

Cmrf cheques-distributed” ఇల్లంతకుంటలో 117 మందికి సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఇల్లంతకుంట, శంకరపట్నం డివిజన్: ముఖ్యమంత్రి సహాయ నిధి (C.M.R.F) నిరుపేదలకు ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందని మానకొండూర్ శాసనసభ్యులు డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో 84 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ₹25.53 లక్షల చెక్కులు మరియు 33 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు ₹33 లక్షల విలువైన చెక్కులు అందజేశారు.

ప్రభుత్వ సహాయం అనేక మందికి ఆర్థిక భరోసా

ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుని బిల్లుల భారం మోయలేని వారికి సీఎంఆర్ఎఫ్ తోడ్పడుతోంది. వైద్య సేవల కోసం ఎవరూ ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం సాయం అందిస్తోంది” అని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు వెలిశాల జ్యోతి, ఇతర నాయకులు పసుల వెంకటి, పాశం రాజేందర్ రెడ్డి, చిట్టి ఆనంద రెడ్డి, మామిడి నరేష్, మామిడి రాజు, నరేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విజయ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Cmrf cheques-distributed” నిరుపేదల వైద్యానికి సర్కార్ తోడ్పాటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *