Khargesabha” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
“బావు, జై భీం, జై సంవిధాన్” కార్యక్రమం కింద శుక్రవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు, క్రియాశీల కార్యకర్తల సమ్మేళనానికి కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం నుండి భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివెళ్లారు.
ఈ సభకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకావడంతో రాష్ట్ర నాయకత్వం దీన్ని విజయవంతం చేయాలని నిశ్చయించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా కార్యకర్తలను వాహనాల్లో తరలించే ఏర్పాట్లు జరిగాయి.
మొత్తం 500 వాహనాల పర్యవేక్షణతో మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల కార్యకర్తలు హైదరాబాద్కు బయలుదేరారు. బెజ్జంకి క్రాస్ రోడ్ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు.
ముఖ్యంగా పాల్గొన్న నాయకులు:
-
శంకరపట్నం మండలము: బత్తిని శ్రీనివాస్ గౌడ్, గోపగోని బసవయ్య గౌడ్, నాంపల్లి తిరుపతి, కోరెం రాజిరెడ్డి, ఆడెపు అజయ్, బొజ్జ చంద్రమౌళి, రెడ్డి పవన్ కుమార్, గట్టు తిరుపతి గౌడ్, బండారి తిరుపతి, ఒగ్గు దామోదర్, సుధగోని లక్ష్మినారాయణ గౌడ్.
-
తిమ్మాపూర్, గన్నేరువరం, బెజ్జంకి, మానకొండూర్, ఇల్లంతకుంట మండలాల నుండి కూడా వందలాది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .
HimachalPradesh floods” 2025తుఫాను భీభత్సం: 69 మంది మృతి, 37 మంది గల్లంతు, రూ.700 కోట్లు నష్టం
