Kothagattu” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు శివారులో జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి ఓ రైతు న్యాయం కోసం పోరాడుతున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రైతు సిద్దూరి రాజేశ్వరరావు రోడ్డు పనులను అడ్డుకోవడంతో స్థానిక పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రాజేశ్వరరావు వివరించగా — కొత్తగట్టు శివారులో 91 సర్వే నంబరులో తనకు చెందిన వ్యవసాయ భూమిలో 11 గుంటలు NH-563 జాతీయ రహదారి విస్తరణలో చేర్చబడ్డాయి. కానీ నష్టపరిహారం విషయంలో అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పక్కన ఉన్న రైతులకు కమర్షియల్ భూమిగా రికార్డులు సవరించి అధిక నష్టపరిహారం అందించగా, తన వ్యవసాయ భూమికి తక్కువ పరిహారం మాత్రమే ఇచ్చారని ఆరోపించారు.
“నాకు జరిగిన అన్యాయాన్ని ఎవరైనా సరిదిద్దాలని, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నాను,” అని రాజేశ్వరరావు అన్నారు.
Oppo Reno14 5G” సరికొత్త డిజైన్‌తో శక్తివంతమైన ఫోన్ ఇప్పుడు మార్కెట్‌లో
