#CongressTelangana #RevanthReddy
శంకరపట్నం, కరీంనగర్ జిల్లా – డిసీ ప్రతినిధి
కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందజేస్తోందని టీపీసీసీ సభ్యుడు, మాజీ జడ్పిటిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలోని గద్దపాక, కాచాపూర్, కన్నాపూర్, అంబాలపూర్, చింతగుట్ట, కరీంపేట, మెట్పల్లి సహా పలు గ్రామాల్లో ఆయన ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ –
“ప్రతి పేద కుటుంబం సొంతింటి కల నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోంది. ఇది ప్రజల పాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గం 15 నెలల కాలంలోనే ఇండ్లు, తెలుపు రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉద్యోగ అవకాశాలు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.”
అలాగే, గత ప్రభుత్వాలు – ముఖ్యంగా టీఆర్ఎస్/బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క ఇంటి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, ప్రజలు వాటిని నమ్మవద్దని, ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య వ్యక్తులు:
-
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్
-
హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి
-
జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్
-
మాజీ సర్పంచ్ తాటికొండ సదానంద చారి
-
గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు
ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇటువంటి ప్రకటనల కోసం సంప్రదిచండి.. 9581519727 వాట్సప్‌లో మేసేజ్ మాత్రమే చేయగలరు
