Cpi Telangana” రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి..

Cpi Telangana”
సిపిఐ మండల కార్యదర్శి సమ్మయ్య…
శంకరపట్నం :డిసీ ప్రతినిధి:
భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల శాఖ కార్యదర్శి, పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలు కూడా పత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలను ఈనెల 19, 20 ,21, 22, రంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహాసభలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ మహాసభలకు శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో హాజర విజయవంతం చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విధి విధానాలను రాష్ట్ర మహాసభలో చర్చించడం జరుగుతుందని ప్రతి కార్యకర్త కంకణ బద్ధుడై మహాసభలకు హాజరై మహాసభలను విజయవంతం చేసి పార్టీ సత్తా చాటాలని సమ్మయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రేగుల కుమార్, బిల్డింగ్ సంఘం నాయకులు ఆరెపల్లి తిరుపతి, నాయకులు గోదారి లక్ష్మణ్, ఎలుకపల్లి సమ్మయ్య , దేవునూరి కొమరయ్య, రెడ్డి సంపత్, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *