Shankarapatnam” తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ జయంతి వేడుకలు…

Shankarapatnam”  తొలి దశ ఉద్యమకారుడు, స్వరాష్ట్రం కోసం ఆస్తుల అమ్మకం…
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మండల అధ్యక్షుడు సదానంద చారి…
శంకరపట్నం: డిసి ప్రతినిధి:
తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మండల ఆధ్వర్యంలో ఘనంగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కన్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ సదానంద చారి మాట్లాడారు. స్వరాష్ట్ర ఆకాంక్ష వేత్త తొలిదశ ఉద్యమ రథసారథి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను మండల కేంద్రంలో నిర్వహించడం జరిగిందని, ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఆకాంక్షగా తన సొంత ఆస్తులను విక్రయించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్ష ధ్యేయంగా తొలిదశ, మలిదశ ఉద్యమాన్ని కొనసాగించారని, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ పోరాట ఫలితంగా నేడు తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడి స్వరాష్ట్రంలో హక్కులను స్వాధించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రొఫెసర్ కోదండరాం సార్ సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి, పద్మ విభూషణ్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో పంచకోటి రాజు, మంతెన రాజమౌళి, శ్రీనివాస్ ఉకంటి రవీంద్ర చారి , నర్సింగోజు సంతోష్ చారి ,సమ్మయ్య చారి, వడ్లూరి రాములు, చల్లూరి రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

 

https://amzn.to/3JiShMG లింక్ పై క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *