District Judge ” తప్పును ఒప్పుగా సృష్టిస్తే చట్టపరంగా చర్యలు..
జిల్లా న్యాయమూర్తి.. వెంకటేష్..
శంకరపట్నం :డిసి ప్రతినిధి:
విద్యార్థినులు తప్పును తప్పుగానే చూడాలి, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, నిజాలు కప్పిపుచ్చి తప్పును ఒప్పుగా చూపిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని జిల్లా సివిల్ న్యాయమూర్తి కే వెంకట్ తెలిపారు. వారంలోగా కస్తూరిబా గాంధీ విద్యాలయం నిర్వహణ శుభ్రంగా ఉండాలి, నిర్లక్ష్యం చేస్తే శాఖ పరంగా చర్యలు తప్పవు హెచ్చరించారు. మీడియా మిత్రులు పాఠశాల నిర్వహణపై నిజాలు వెలుగులోకి తెచ్చి విద్యార్థినీలకు అండగా నిలవాలని జిల్లా సివిల్ న్యాయమూర్తి కే వెంకట్ అన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం,శంకరపట్నం మండలం, కేశవపట్నంలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో బుధవారం కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. చట్టాలపై, బాలికల యోగక్షేమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా సివిల్ న్యాయమూర్తి వెంకటేష్ మాట్లాడారు. 1987 సంవత్సరంలో చట్టాలు చేసినట్టు చెప్పారు. చట్టాలు అందరికీ సమానంగానే వర్తిస్తాయన్నారు. బాలికలకు ఎలాంటి ఆపద కలిగిన టోల్ ఫ్రీ నెంబర్ 15100 నంబర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే బాలికలకు రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. కస్తూరిబా గాంధీ విద్యాలయంలో పదిమంది విద్యార్థులకు ఎలుకలు కాటు వేయడం విచిత్రంగా ఉందని, తన న్యాయ విజ్ఞాన సదస్సుకు హాజరయ్యే ముందు పాఠశాల పూర్తి పరిసరాలను పరిశీలించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీప్ లాంప్స్ టి మహేష్, పాఠశాల ఇన్చార్జి ఎస్ఓ సరిత, ఉపాధ్యాయనీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Redmi Pad Pro” పవర్‌ఫుల్ ఫీచర్లతో .. మీ డిజిటల్ అవసరాలకు అద్భుతమైన పరిష్కారం
లింక్ పై క్లిక్ చేయండి..
