LocalNews” మొలంగూర్ లేబర్ క్యాంపులను తనిఖీ చేసిన పోలీసులు…
శంకరపట్నం డిసీ ప్రతినిధి… (దండు సమ్మయ్య)

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ రూరల్ సిఐ పులి వెంకట్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, మొలంగూర్ లో గల
కావేరి సీడ్స్, చైతన్య సీడ్స్ కంపెనీలకు చెందిన లేబర్ క్యాంపులను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్ మాట్లాడారు. హుజురాబాద్ రూరల్ పరిధిలోని పలు కంపెనీలలో వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువగా ఉండడంతో, ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కేశవపట్నం ఎస్సై కొత్తపల్లి రవి ఆధ్వర్యంలో పరిశీలించామన్నారు. కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొలంగూర్ గ్రామంలో గల చైతన్య సీడ్స్, కావేరి సీడ్స్ లేబర్ క్యాంపులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, లేబర్ కూలీలకు ప్రభుత్వ నిషేధిత గంజాయి ఇతర మాదకద్రవ్యాలను వాడరాదని అవగాహన కల్పించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక, చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేశవపట్నం ఎస్సై రవి, ఏ ఎస్ ఐ సుధాకర్, పోలీసులు, లేబర్ తదితరులు పాల్గొన్నారు.


Earthquake” భూ ప్రకంపనలు.. అర్థంకాక పరుగులు పెట్టిన ఏనుగులు.. వీడియో
Robo” రోబోల బాక్సింగ్ చూశారా…? ఇప్పుడు చూడండి వీడియో
Nasa” ఒక్క ఐడియా చెప్పండి.. రూ. 25 కోట్లు అందుకోండి..
New Airport”ఈ ఏయిర్పోర్ట్ ఇప్పటిది కాదు… స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ ఏర్పాటు..
