Edateripi Varshalu”రైతులు అప్రమత్తంగా ఉండాలి…

Edateripi Varshalu” వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి..
శంకరపట్నం: డిసీ ప్రతినిధి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రైతులు మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి గురువారం సూచించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో తిరుపతి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి రైతులు కరెంటు మోటార్ల వినియోగం సమయంలో విద్యుత్తు వైర్లను చూసుకొని, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విద్యుత్తు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని వర్షాలు కురుస్తున్న సమయంలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి పంట పొలాలను పరిశీలించే సమయంలో విద్యుత్తు వైర్లను చూసుకోవాలని సూచించారు. పురాతనమైన ఇండ్లలో నివాసముండే ప్రజలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇండ్లు కూలి ప్రమాదాలు సంభవిస్తాయని, ప్రమాదం జరగకముందే తమ పరిస్థితిని అధికారులకు సమాచారం అందిస్తే గ్రామాల్లోని ప్రభుత్వ నిర్మాణాల్లో పునరావాసం కల్పించడం జరుగుతుందని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రమాదాల నివారణకు తమ వంతు కృషి చేయాలని తిరుపతి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *