Molangur”
శంకరపట్నం:
తాసిల్దార్ సురేఖ..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కూలిపోయిన బాధిత కుటుంబానికి ఇందిరామ్మ ఇల్లు మంజూరుకు కృషి చేస్తానని మండల తాసిల్దార్ గ్రామ ప్రత్యేక అధికారి కే సురేఖ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన జంపాల పోచయ్య, చిట్టి బాబు ఇల్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూలిపోయింది. సమాచారం తెలుసుకున్న గ్రామ ప్రత్యేక అధికారి, మండల తాసిల్దార్ కే సురేఖ క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేఖ మాట్లాడారు. మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు పోచయ్య ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి సమాచారం మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టు చెప్పారు. బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కు కృషి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తాసిల్దార్ సురేఖ తెలిపారు.
బాధిత కుటుంబానికి నాయకుల బాసట..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొలంగూర్ గ్రామానికి చెందిన జంపాల పోచయ్య ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో సమాచారం తెలుసుకున్న తెలంగాణ జన సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మోరె గణేష్, తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటు హడక్ కమిటీ సభ్యులు మోరె ప్రభాకర్, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు అధికారులకు సమాచారం ఇచ్చి, తమ వంతు సహాయంగా ఒక్కరోజు భోజనాలు ఏర్పాటు చేశారు. నిత్యవసర సరుకులు అందజేస్తామని, బాధిత కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు కదిరి కొమరయ్య, జన సమితి గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Molangur” బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేస్తా…
