Thursday , 19 September 2024
Breaking News
vemulawada crime

vemulawada crime”లంకె బిందేలున్నాయ‌ని రూ. 30లక్షలు లక్షలు దోచారు

vemulawada crime” చాకచక్యంగా ప‌ట్టుకున్నవేముల‌వాడ‌ పోలీసులు
అమాయ‌క‌త్వాన్ని ఆస‌రా చేసుకుని ల‌క్ష‌లు దోచుకుంటున్నారు కేటుగాళ్లు. మోస‌గాళ్లు ఏదో ఒక రూపంలో అమాయ‌కుల‌ను నిండా ముంచుతూనే ఉన్నారు. తాజాగా వేముల‌వాడ‌లోనూ దొంగ పూజారిని న‌మ్మి రూ. 30 ల‌క్ష‌ల పొగొట్టున్న ఘ‌ట‌న చోటు చేసుకుంది. వేముల‌వాడ ప‌ట్ట‌ణ సీఐ వీర ప్ర‌సాద్ తెలిపిన వివరాల ప్ర‌కారం.. వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లి (కోనాయపల్లి) గ్రామానికి చెందిన సింగారపు అంజవ్వ అనే మహిళ ఏడాదిన్నరగా అనారోగ్యంతో బాధపడుతున్న‌ది. ఈ విషయాన్ని తన సమీప బంధువు అయిన ఎల్లయ్య కు చెప్పింది. దీంతో ఎల్లయ్య వేములవాడ అర్బన్ మండలంలోని చంద్రగిరిలో మహిపాల్ అనే ఓ పూజారి ఉన్నాడని చెప్పాడు. అతని దగ్గరికి వెళ్లి నాటు వైద్యం చేయించుకుంటే రోగం నయమవుతుందని అంజవ్వను న‌మ్మించాడు. అనంత‌రం మహిపాల్ దగ్గరికి తీసుకువెళ్లాడు. ఇలా వైద్యం కోసం నిత్యం మహిపాల్ దగ్గరికి వెళ్తూన్న క్ర‌మంలో హన్మవ్వ తన స‌మస్యలతో పాటు వ్యక్తిగత విషయాలను మ‌హిపాల్ తో చెప్పుకుంది. ఇదే అదునుగా భావించిన మహిపాల్, అంజవ్వ జాతకం చూసి తన తల్లిగారి ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని, వాటిని తవ్వితీస్తే పెద్ద ఎత్తున బంగారం లభిస్తుందని న‌మ్మిబ‌లికాడు. వాటిని తవ్వి తీసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు అవుతాయని అంజ‌వ్వ‌కు చెప్పాడు. మ‌హిపాల్ మాట‌లు నమ్మిన అంజవ్వ విడతల వారీగా మహిపాల్ కు డబ్బులు ముట్ట‌జెప్పింది. ఇలా సుమారు రూ. 20లక్షల మహిపాల్ కు అప్పజెప్పింది. ఇదే సమయంలో మహిపాల్, అంజవ్వల వ్యవహార శైలిని గమనించిన సుద్దాలకు చెందిన అబ్రహం అనే వ్యక్తి కొంతకాలం తర్వాత వీరువురిని సంప్రదించి లంకె బిందెల్లో నుండి తీసిన బంగారం కడిగేందుకు తాను సహకరిస్తానని చెప్పి వారితో జతకట్టాడు. అబ్రహం మాటల నమ్మిన అంజవ్వ మ‌రో రూ. 10లక్షల అప్పజెప్పింది. ఇలా మొత్తం రూ. 30లక్షలు ఇద్దరికీ అప్పజెప్పింది. అయితే రోజులు గడుస్తున్న‌ప్ప‌టికీ మహిపాల్, అబ్రహం లు చెప్పిన విధంగా జరగకపోవడం, ఇచ్చిన డబ్బుల విషయంలో వారు ఇద్దరు స్పందించకపోవడంతో ఇక మోసపోయానని గ్రహించిన అంజవ్వ వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంజవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మహిపాల్ (ఏ1) అబ్రహం (ఏ 2) ఎల్లయ్య(ఏ 3)లను చాకచక్యంగా పట్టుకుని శనివారం రిమాండ్ కు తరలించినట్టు సీఐ తెలిపారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

TS group-1″ గ్రూప్ వ‌న్ పరీక్షపై కీలక ప్రెస్ నోట్..

Kajal cinema”జూన్‌ 7కు వాయిదా ప‌డ్డ కాజల్‌ సత్యభామ

Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం ప‌ని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైర‌ల్

Road Accident”ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? ఆర్టీసీ ఎండీ వీడియో ట్వీట్ వైర‌ల్

Helicopter Accidents” హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాల్లో మృతి చెందిన ప్ర‌ముఖులు వీరే.. ఎప్పుడెప్పుడు ఎవ‌రెవ‌రంటే..

meteors”ఆకాశంలో అద్భుతం.. వెలుగులు విర‌జిమ్మిన ఉల్క‌లు.. వీడియో

Viral video” న‌డిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చ‌ల్లార్చిన యువ‌కుడు..వీడియో వైర‌ల్

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Water Video Viral” నీటి ఒత్తిడికి గాల్లో లేచిన జేసీబీ వీడియో వైర‌ల్

About Dc Telugu

Check Also

Spin Mop

Spin Mop” స్పిన్ మాప్ టూఇన్ వ‌న్.. 40 శాతం త‌గ్గింపుతో.. కేవ‌లం రూ. 1089కే .. నాలుగు పీస్‌లు

ఇల్లు తుడించేందుకు ఉపయోగ‌ప‌డే స్పిన్ మాప్ పై అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్‌లో భారీ త‌గ్గుద‌ల ప్ర‌క‌టించింది. 40 శాతం త‌గ్గింపు …

Redmi LED Fire TV

Redmi LED Fire TV” 32 ఇంచుల టీవీ కేవ‌లం కేవ‌లం రూ. 11499 కే..

Redmi LED Fire TV” రెడ్ ఎంఐ నుంచి 32 ఇంచుల టీవీ కేవ‌లం రూ. 11,499 కే స్మార్ట్ …

Wooden Table Desk

Wooden Table Desk” రూ. 2నుంచి 3 వేల లోపు మంచి స్ట‌డీ, ల్యాప్‌టాప్ టేబుల్.. ఇప్పుడే ఆర్డ‌ర్ చేయండి

Wooden Table Desk” పిల్ల‌ల చ‌దువు కోసం కానీ లేదా ల్యాప్టాప్ కోసం త‌క్కువ ధ‌ర‌లో మంచి టేబుల్ కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com