shankarapatanm” రీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి…
డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు..
శంకరపట్నం డిసి ప్రతినిధి
ప్రజా ఆరోగ్యమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గల లక్ష్యమని, రీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు, వైద్య సిబ్బంది. ప్రత్యేక పెద్ద వహించి వైద్య సేవలు అందించాలని, హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్వో చందు వైద్య ఆదేశించారు. గురువారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్వో చందు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి మాట్లాడారు. వర్షాకాలం లో విష జ్వరాలు ప్రభలే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నీటి నిల్వతో దోమల వృద్ధి ఎక్కువగా ఉండి ప్రజలకు సీజనల్ వ్యాధులు దోమల ద్వారా ప్రభలు తాయని, వైద్యులు, వైద్య సిబ్బంది, ప్రజలు సీజనల్ రోగాల బారిన పడకుండా ఆరోగ్యం పై ప్రజలకు అవగాహన కల్పించి, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించి రోగాల భారీ నుండి ప్రజలను వైద్య సిబ్బంది రక్షించాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని వైద్యశాలలో రోగులను వైద్య సేవలపై అడిగి తెలుసుకుని, వైద్య అధికారికి సిబ్బందికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి గొట్టే శ్రావణ్ కుమార్, ఆయుర్వేద డాక్టర్ సంధ్య, ఎం ఎల్ హెచ్ పి మనోచిత్ర, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భాస్కర్, హెల్త్ సూపర్వైజర్ అనిల్, వైద్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.
shankarapatanm” ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం..
