Group 1″ వరుస వివాదాలు చుట్టుముట్టిన గ్రూప్ వన్ నోటిఫికేషన్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ ) సోమవారం రద్దు చేసింది. 2022 సంవత్సరం ఏప్రిల్ లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొదటి సారి పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ అవడంతో రెండో పరీక్ష నిర్వహించారు. తరువాత రెండో పరీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని అభ్యర్థులు కోర్టు కెళ్లారు. దీంతో పరీక్షను రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. టీఎస్‌పీఎస్‌సీ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ సమయంలోనే తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. సుప్రీంకోర్టులో చేసిన సవాల్‌ను వెనక్కి తీసుకున్నది. దీంతో సోమవారం (ఫిబ్రవరి 19) గ్రూప్ వన్‌ను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన 503 పోస్టులకు కొత్తగా మరో 60 పోస్టులు కలిపి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మొత్తంగా 563 పోస్టులతో 15 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం..
ఇవి కూడా చదవండి
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక దంపతుల ఆత్మహత్య
Mahalaxmi scheme” నూట పదిరూపాలు ఇచ్చి నిలబడి పోవాల్నా.. ఓ ప్రయాణికుడి ఆవేదన
Fish Viral video లక్షలాది చేపలు ఒక్కసారిగా.. వీడియో వైరల్