Mahalaxmi scheme” తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగా మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీగా విపరీతంగా పెరిగింది. ఎక్కడ ప్రారంభమైందో తెల్వదుకానీ హైదరాబాద్ పోతున్న బస్సు లో ఓ ప్రయాణికుడి ఆవేదన వైరల్ అవుతున్నది. రోజు హైదరాబాద్ పోతున్న… ఐదు రోజులుగా నిలబడే పోతున్ననంటూ వాపోయాడు. నూట పది రూపాయలు ఇచ్చి కూడా నిలబడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అతని వెనకాలో ఓ పెద్దాయన కూడా నిలబడే ఉన్నారు. అతడి చేతులు తీవ్రంగా వణుకుతున్నాయి. పురుషులకు ప్రత్యేక బస్సులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వెనకాల కొంత మందిపురుషులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఫ్రీ బస్ వల్ల మాకు సీట్లు దొరకట్లేదు pic.twitter.com/rM97vhOweP
— Telugu Scribe (@TeluguScribe) February 16, 2024
ఇవి కూడా చదవండి
Fish Viral video లక్షలాది చేపలు ఒక్కసారిగా.. వీడియో వైరల్