Mirai : మొద‌టి రోజు రూ. 27 కోట్లు వసూలు చేసిన మిరాయ్..

Mirai

Mirai: మిరాయి సినిమా భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల మ‌ధ్య‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో యువ హీరో తేజ సజ్జా , మంచు మనోజ్‌ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. భారీ అంచ‌నాల‌ను అందుకోవడంలో ఈ సినిమా విజయాన్ని ద‌క్కించుకుంది. ఈ వసూల్ల విష‌యాన్ని నిర్మాణసంస్థ ఆఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. మొద‌టి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 27.20 కోట్ల రూపాయాలు వ‌సూలు చేసిన‌ట్టు చెప్పింది. ఈ విజ‌యంపై క‌థనాయ‌కుడు తేజ సజ్జా స్పందించారు. ‘విూ ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాన‌న్నారు. ఇదే మిరాయ్ ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు అంటూ స‌జ్జా సంతోషం వ్యక్తంచేశారు. భార‌త దేశవ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్‌లోనూ మిరాయ్‌కు విశిష్ట స్పందన వ‌స్తోంది. తొలి రోజు ఇత‌ర దేశాల్లో 7లక్షల డాలర్లు రూపాయ‌ల‌ను తెచ్చిపెట్టిన‌ట్టు సినిమా నిర్మించిన సంస్త చెప్పింది. ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌పై సోష‌ల్ మీడియాలో ప్రశంసలు వ‌ర్షం కురుస్తోంది. దీనిపై ప్రముఖులు కూడా దీనిపై పోస్ట్‌ పెడుతూ అభినందిస్తున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ కూడా సంతోషం వ్య‌క్తం చేశారు. ఎంతో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారని.. ఫ్రేమ్‌ టూ ఫ్రేమ్‌ చెక్‌ చేసినా బ్లర్‌ లేకుండా స్పష్టంగా కనిపిస్తున్నాయని సోషల్‌ విూడియా వేదికగా వీఎఫ్‌ఎక్స్‌ టీమ్‌ను కొనియాడారు. .
తేజ ‘హను-మాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ త‌ర్వాత ఎన్నో సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ మిరాయ్ ‘ కోసం వాటిని వదిలేసుకున్నారు. ఈ ఫాంటసీ అడ్వెంచర్ కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ హీరో సూపర్‌ యోధాగా కనిపించి మెప్పిస్తున్నారు. మంచు మనోజ్‌ మహావీర్‌ లామా పాత్రలో నూ ఆకట్టుకుంటున్నారు. మీరు సినిమా చూశారు.. అయితే కామెంట్ బాక్సులో పంచుకోండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *