Gurugram accident” కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అడ్డంగా లేన్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలు వాహనాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. గురుగ్రామ్-సోహ్నా ముంబై-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌వేపై సోమవారం తెల్లవారుజామున అతివేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పింది. అదుపు తప్పిన కారు పక్క లేన్‌లోకి అడ్డంగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఢిల్లీలోని నాథుపూర్, ఘిటోర్ని నివాసితులైన అక్షిత్, దక్ష్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొక విద్యార్థి ధ్రువ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు మరోక కారు నడుపుతున్న సోహ్నా నివాసి మోహిత్, పాల్వాల్‌కు చెందిన బైకర్ ఈశ్వర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చికిత్స కోసం సమీపంలోని దవాఖానాకు తీసుకెళ్లారు. ఈ ప్రమాదంతో హైవేపై వాహనాలు కుప్పలు తెప్పలుగా నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
गुरुग्राम सोहना एलिवेटेड रोड पर दिल्ली मुम्बई एक्सप्रेस वे के पास
दर्दनाक हादसा हुआ जिसमे कार सवार 5 लोगों में से 2 की मौत हो गई और 3 गंभीर घायल हो गए वीडियो में देख सकते है कि बस को Overtake करने के चक्कर में कार Control से बाहर हो गई है । #Newswani #gurugram pic.twitter.com/t3C8kkR1bR— daily newswani (@DNewswani) November 5, 2024
Pushpa 2″ అదిరిన పుష్ప 2 ప్రమోషనల్ ప్లాన్.. తగ్గేదెలే..
Video Viral” ఈ గుర్రం ఏంటీ.. అమ్మాయిలను ఎగిరి తన్నింది.. వీడియో వైరల్
Water Bottle” 18 రూపాయలకే… స్టెయిన్‌లెస్-స్టీల్ వాటర్ బాటిల్