బ్రెజిల్ దేశంలో భారీ తుఫాన్ విలయం సృష్టించింది. తుఫాన్ దాటికి 41 మృతి చెందగా 50 గల్లంతు అయ్యారు. దేశంలోని దక్షిణ ప్రాంతంలో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ కుండపోత వర్షం, వరదలు బీభత్సంగా సృష్టించాయి. బ్రెజిల్ రెస్క్యూ టీం 50 మంది కోసం వెతుకుతున్నారు. కొండలపై అక్రమంగా నిర్మించిన భవనాలు ప్రాణాంతకంగా మారాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు భారీ వరదలకు 223 మంది గాయపడ్డారు. 11 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 12 హెలికాప్టర్లు, 1000 మంది రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. రెండు వంతెనలు, పలు రోడ్లు ధ్వంసమయ్యాయి. 8 సైనిక విమానాలు, వందలాది మంది సైనికులు సెర్చ్ అండ్ రెస్క్యూలో పాల్గొంటున్నారు. తుపాన్ బాధితులు 20వేలమందికి ఆహారం, ఔషధాలను అందించారు. బ్రెజిల్ దేశంలో తుపాన్ విపత్తు వల్ల అత్యవసర పరిస్థితిని ప్రకటించామని అల్క్ మిన్ బ్రెసిలియాలో ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
మొరాకోలో భూకంపం 632 మంది మృత్యువాత
కొబ్బరి చెట్టు ఏదేశంలో పుట్టింది.. కొబ్బరి చరిత్ర ఇంతింత కాదు