Neet Rank Holder” ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపుతో విరాళాల వెల్లువ… నీట్ ర్యాంకర్ మార మహేశ్‌కు ₹3.22 లక్షల ఆర్థిక సహాయం శంకరపట్నం డిసీ ప్రతినిధి

Neet Rank Holder”  NEET (NSIT) నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో 453వ ర్యాంకు, ఎస్సీ కేటగిరీలో 17వ ర్యాంకు సాధించిన గంగిపల్లి గ్రామానికి చెందిన మార మహేశ్‌కు విద్య కొనసాగించేందుకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు నాయకులు, అధికారులు ముందుకొచ్చారు. మార మహేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన నిరుపేద విద్యార్థి. ఇతడు నీట్ చదవాలనే లక్ష్యంతో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో చదువు ఆగిపోతుందన్న సమాచారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టికి వచ్చింది.

ఎమ్మెల్యే పిలుపుతో విరాళాల వెల్లువ
మహేశ్‌కు చదువులో అండగా నిలవాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు స్పందనగా మానకొండూర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు మరియు అధికారులు కలసి ₹3,22,000 విరాళాలు సమీకరించారు.

ఈ మొత్తాన్ని ఎల్ఎండీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో చెక్కుగా విద్యార్థి మహేశ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:

“మహేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివి జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించడం గర్వకారణం. ఇలాంటి విద్యార్థులకు మేమంతా చేతనైనంత సహాయం చేయాలి. అన్నారు.

అధికారుల ఆసక్తి, వ్యక్తిగత సాయం
చదువు పట్ల మహేశ్ యొక్క నిబద్ధతను గుర్తించిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్, ఆర్డీవో మహేశ్వర్ లు కూడా మహేశ్‌ను కలిసి అభినందించారు. కుటుంబ పరిస్థితుల గురించి తెలుసుకున్న వారు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అదనపు కలెక్టర్ వ్యక్తిగత సాయం అందించగా, ఆర్డీవో మరింత సహాయాన్ని హామీ ఇచ్చారు.

మహేశ్ కృతజ్ఞతలు వ్యక్తం
తన విద్య కొనసాగించేందుకు లభించిన ఈ మద్దతుతో మహేశ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

“NEET నీట్ లో మూడేళ్లకు సరిపడా ఫీజులు చెల్లించగలిగే స్థితిలోకి వచ్చాను. ఇది నాకు కొత్త జీవితం లాంటిది. అందుకు ఎమ్మెల్యే గారికి, అధికారులకు, పార్టీ నాయకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని మహేశ్ తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *