ఇండియా న్యూజిలాండ్ సెమిఫైనల్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరిదాకా నువ్వానేనా అన్న స్థాయిలో సాగిన మ్యాచ్ లో బౌలర్ మలుపు తిప్పాడు. మొదట బ్యాటింగ్ భారత్ 397 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ కు వచ్చిన న్యూజిలాండ్ గెలుపు దిశగా పోరాటం సాగించింది. 327 పరుగుల వద్ద న్యూజిలాండ్ అలౌట్ అయ్యింది. అయితే మ్యాచ్‌లో ఏడు వికెట్లు పడగొట్టి మహ్మద్ షమీ న్యూజిలాండ్ నడ్డి విరిచాడు. దీంతో భారత్ ఫైనల్‌కు చేరింది. అయితే ఇంతటి ప్రతిభ కలిగిన షమిని విధి పగబట్టింది.
షమీ తండ్రి ఆరేండ్ల క్రితం మరణించాడు. నూరేండ్లు తోడుంటుందనుకున్న భార్య విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకోవడంత పాటు గృహ హింస కేసు నమోదు చేయించింది. తన కన్న బిడ్డ ఆరోగ్యం బాగాలేదు. డబ్బులు తీసుకుని పాకిస్థాన్‌కు అనుకూలంగా ఆడుతాడనే ట్రోల్స్ కూడా వచ్చాయి.
ఇన్ని రకాలు సమస్యలు ఎదుర్కొంటూ ఎక్కడా తలొగ్గలేదు. కుంగిపోలేదు. అన్ని రకాల అవకాశాలను వాడుకుంటూ ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నారు.
ఈ ప్రపంచకప్‌లో షమీ వికెట్ టేకర్ 23 వికెట్లు పడగొట్టాడు. ప్రపంచకప్ చరిత్రలోనే భారత బౌలర్లు ఇన్ని వికెట్లు తీయడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి
రోహిత్ శర్మ చీటింగ్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సికందర్ భక్త్
మొన్న రష్మిక ..నేడు కాజల్ కాజోల్ డీఫేక్ వీడియోలు రెచ్చిపోతున్న కేటుగాళ్లు
బొగ్గుగని కంపెనీ ఆఫీస్‌లో ఎగిసిపడ్డ మంటలు 6గురు మృతి 38 మందికి గాయాలు