Integrated BED” 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగేండ్ల ‘ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలయింది. నేషనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2025’ పేరిట ఈ పరీక్ష జరగనుంది. అయితే ఈ ఎగ్జామ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది.. దేశవ్యాప్తంగా ఉన్న 64 విద్యా సంస్థ ల్లోని 6,100 సీట్లలో ఈ ప్రోగ్రామ్ ద్వారా అడ్మిషన్లు పొందొచ్చు. ఎగ్జామ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా సంస్థలు ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వస్తారు. ఆ తర్వాత , బీఎస్సీ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఏ-బీఈడీ, కోర్సులో సీట్లను భర్తీ చేస్తాయి.
అర్హత..
ఇంటర్ విద్యార్హత ఉన్న వారు దీనికి దర ఖాస్తు చేసుకోవచ్చు.
ఇందులో జాయిన్ కావడానికి ఎలాంటి వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష… మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
పరీక్షను నిర్వహించే భాష తెలుగు, ఇంగ్లిష్, హిందీతోపాటు 13 భాషల్లో నిర్వహిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ : మార్చి 16
పరీక్ష తేదీ: ఏప్రిల్ 29
అభ్యర్థులు INR లో చెల్లించాల్సిన ఫీజు
జనరల్ అభ్యర్థులకు 1200
ఓబీసీ వారికి 1000
ఎస్సీ/ ఎస్టీ/థర్డ్ జెండర్ / పీడబ్ల్యూ వారికి 650
రుసుమును నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ యూపీఐ UPI ద్వారా సమర్పించొ చ్చు.
1. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన దశలు.
స్టెప్ -1 (రిజిస్ట్రేషన్ ఫారం):
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం కోసం నమోదు చేసుకోండి. అభ్యర్థి ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపేటప్పుడు అవసరమైన రిజిస్ట్రేషన్ వివరాలను అందించాలి. పాస్‌వర్డ్‌ను సృష్టించి, భద్రతా ప్రశ్నను ఎంచుకుని నమోదు చేయాలి. వ్యక్తిగత వివరాలను విజయవంతంగా సమర్పించిన తర్వాత, ఒక దరఖాస్తు సంఖ్య వస్తుంది. ఈ సంఖ్య దరఖాస్తు ఫారమ్ యొక్క మిగిలిన దశలను పూర్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
తదుపరి లాగిన్‌ల కోసం, అభ్యర్థి సంబంధిత సిస్టమ్ ద్వారా రూపొందించబడిన దరఖాస్తు సంఖ్య మరియు పాస్‌వర్డ్‌తో నేరుగా లాగిన్ అవ్వగలరు.
స్టెప్ 2 (దరఖాస్తు ఫారం): అభ్యర్థులు సిస్టమ్ జనరేట్ చేసిన అప్లికేషన్ నంబర్ మరియు ముందే సృష్టించిన పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వవచ్చు. ఇందులో వ్యక్తిగత వివరాలను పూరించడం. పేపర్‌కు దరఖాస్తు చేసుకోవడం. విద్యా అర్హతల వివరాలను అందించడం మరియు ఫొటోలు మరియు పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయవచ్చు:
అభ్యర్థి ఫోటోగ్రాఫ్, సంతకం, కేటగిరీ సర్టిఫికేట్ (వర్తించే చోట), పీడబ్ల్యూ డీ (PWD) సర్టిఫికేట్ (వర్తించే చోట) అప్లోడ్ చేయాలి.
ఇటీవలి ఫోటోగ్రాఫ్ ను స్కాన్ చేయాలి. మరియు సంతకం జేపీజీ / జేపీఈజీ (JPG / JPEG) ఫార్మాట్‌లో ఉండాలి.
ఫోటోగ్రాఫ్ పరిమాణం 10 kb నుండి 200 kb మధ్య ఉండాలి.
స్కాన్ చేసిన సంతకం సైజు 4 kb నుండి 30 kb మధ్య ఉండాలి.
సర్టిఫికెట్ల స్కాన్ చేసిన కాపీ సైజు 50 kb నుండి 300 kb మధ్య ఉండాలి
దశ 3: నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/UPI ద్వారా పరీక్ష రుసుము చెల్లించండి:
అభ్యర్థి దరఖాస్తు రుసుము చెల్లించడానికి నెట్ బ్యాంకింగ్/డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/UP ఎంపికను ఎంచుకోవాలి. మరియు రుసుము చెల్లింపును పూర్తి చేయడానికి ఆన్‌లైన్ సూచనలను అనుసరించాలి. విజయవంతమైన చెల్లింపు తర్వాత, అభ్యర్థి నిర్ధారణ పేజీని ముద్రించగలరు. రుసుము చెల్లించిన తర్వాత నిర్ధారణ పేజీ జనరేట్ కాకపోతే, లావాదేవీ రద్దు చేయబడుతుంది. అభ్యర్థులు మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. అయితే, నిర్ధారణ పేజీ జనరేట్ కాకపోతే అభ్యర్థి మరొక చెల్లింపు లావాదేవీని చేయాలి.
ఆఫిషియల్ వెబ్సైట్‌కు వె ళ్లేందుకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://ncet2025.ntaonline.in/
ఇవి కూడా చదవండి
Smart Phone” ఐక్యూ 12 5జీ లెజెండ్ స్మార్ట్ ఫోన్… 256 స్టోరేజీతో..
Samsung Galaxy M16″ తక్కువ ధరలో సాంసంగ్ గెలాక్సీ ఎం 16(5జీ)… వివరాలు చూడండి..
Constable Jobs” ఐటీబీపీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పదో తరగతి అర్హత
Manchu Vishnu”ఇంజిన్‌లో చక్కెర పోస్తే మైలేజ్ పెరుగుతుంది.. మంచు విష్ణు ఆన్సర్..