Yoga day” హుజూర్ నగర్ జూన్ 21,
పట్టణంలోని పెరల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ పాఠశాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ డిసి ప్రకాష్, పాఠశాల ప్రిన్సిపల్ మురగన్ లు మాట్లాడుతూ
విద్యార్థులు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసికంగా ఉల్లాసంగా ఉంటారని అన్నారు. ప్రతి రోజు క్రమం తప్పకుండ యోగా చేయటం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని, చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని,రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలని ఆదిగమించవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రవీణ్, హరీష్, రాజు ,సైదులు, హైమావతి ,అరుణ, సంధ్య, ఝాన్సీ ,స్రవంతి, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు..
