జెమ్స్ పాఠశాలలో నట్టల నివారణ మాత్రల పంపిణీ: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయం

జెమ్స్ పాఠశాలలో నట్టల నివారణ మాత్రల పంపిణీ
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ

60 మంది విద్యార్థులకు అల్బెండాజోల్ మాత్రలు అందజేత

జగిత్యాల, జూలై 14: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన జాతీయ నట్టల నివారణ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలోని జెమ్స్ పాఠశాలలో నట్టల నివారణ (అల్బెండాజోల్) మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ మంజుల పాఠశాలలోని సుమారు 60 మంది విద్యార్థులకు స్వయంగా నట్టల నివారణ మాత్రలను అందజేశారు. అనంతరం విద్యార్థులకు నట్టల నివారణ వల్ల కలిగే ప్రయోజనాలు, పరిసరాల పరిశుభ్రత, మరియు పోషకాహారం తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

విద్యార్థుల ఆరోగ్యమే విద్యాభివృద్ధికి పునాది
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ కె. చిన్నన్న మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యమే వారి విద్యాభివృద్ధికి అసలైన పునాది అని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే ఇటువంటి ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలను ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

పాఠశాల ప్రిన్సిపాల్   మల్లిక మాట్లాడుతూ, నట్టల నివారణ మాత్రలు వేసుకోవడం ద్వారా పిల్లలు శారీరక ఆరోగ్యంతో పాటు చదువుపై మరింత ఏకాగ్రతను పెంచుకోగలరని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

మానేర్ కళాశాలలో డి.ఎల్.ఎడ్ స్పాట్ అడ్మిషన్లు: ఈ నెల 18 నుంచి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ

గంగాధర లో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాల ప్రారంభం.. నూతన ప్రవేశాలకు అవకాశం

బాధితులకు చేరిన ‘పోగొట్టుకున్న’ ఫోన్లు.. రూ. 12 లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసిన వన్‌టౌన్ పోలీసులు