atal setu” చావడానికి చాలా ధైర్యం కావాలంటారు కానీ ఇప్పుడు చిన్నా పెద్దా తేడాలేకుండా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. సమస్య ను పరిష్కారం దిశగా ఆలోచించకుండా ఆత్మహత్యనే పర్కిష్కారంగా భావిస్తున్నారు. ముంబైలోని అటల్ సేతు బ్రిడ్జిపై చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం.. అటల్ సేతు బ్రిడ్జిపై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఒక కారు వేగంగా వచ్చి ఓ చోట ఆగింది. అందులోనుంచి ఓ వ్యక్తి దిగి చకచకా వెళ్లి అరేబియా సముద్రంలో దూకేశాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన కారుటూరి శ్రీనివాస్ దుబాయ్‌లో ఉద్యోగం చేసి ఏడాది క్రితం ఇండియా తిరిగి వచ్చారు. ఏడాది నుంచి ముంబైలో ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం జులై(24)న 12 గంటల సమీపంలో అటల్ సేతు బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు కారును పరిశీలించగా అందులో అతని వివరాలు ఉన్నాయి. అతనికి భార్య, ఐదేండ్ల కుమార్తె ఉన్నది. కాగా అతని ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Shocking
A man stopped a car on #AtalSetu, came out and jumped straight into the sea. He had earlier ingested a floor cleaner while working in Kuwait in 2023 in an attempt to end his life.
This is really concerning situation as people use well developed infrastructure to… pic.twitter.com/OoCGGMi8r4
— Thummar Ankit (@mathrunner7) July 25, 2024
ఇవి కూడా చదవండి
Bus Accident” అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు.. పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది
Thirupathi Crime news” అన్న కుటుంబాన్ని హత్యచేసిన తమ్ముడు.. ఇష్టం లేని పెండ్లి చేశారనే.
Rain alert” ఈ జిల్లాల్లో రేపు భారీ వర్షాలు
Whale Viral Video” బోటుపై దాడి చేసిన భారీ తిమింగలం.. వీడియో వైరల్
Plane Crash” టేకాఫ్ అవుతూ ఘోర విమాన ప్రమాదం.. 19 మంది మృతి.. వీడియో