Samajika Sevakarta” శంకరపట్నం: డిసీ ప్రతినిధి:
సామాజిక సేవాకర్త, దైవ ప్రియుడు తుమ్మ రఘుపతి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో ఆశేష జన వాహిని కుటుంబ సభ్యుల రోజుల నడుమ ముగిశాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ,శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామానికి చెందిన తుమ్మ రఘుపతి అనే సామాజిక కార్యకర్త, దైవ ప్రియుడు, అనారోగ్యానికి గురై ఈ నెల 5 న మొలంగూర్ గ్రామంలో స్వగృహంలో మృతి చెందాడు. రఘుపతి మరణ వార్త తెలుసుకున్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సేవాకర్తలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు గ్రామస్తులు శనివారం మృతదేహాన్ని సందర్శించారు. రఘుపతి పార్థివ దేహానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించి సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారాల్లో పాలుపంచుకొని రఘుపతికి కన్నీటి వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టాయి. రఘుపతి మృతితో మొలంగూర్ గ్రామంలో విషాదఛాయలు అల్లుమకు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, సామాజిక సేవాకర్తలు గ్రామస్తులు యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Samajika Sevakarta” కుటుంబ సభ్యుల రోదనలు, ఆశేష వాహిని నడుమ… సామాజిక సేవకర్త రఘుపతి అంత్యక్రియలు…
