రక్తాన్ని రంగరించి వందల వేల గంటలు పనిచేసి 60 ఏండ్ల గోసను పొగొట్టామని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఒక్క మంత్రులు, ముఖ్య మంత్రి, పార్టీ నాయకులే కాదు.. వేలాది మంది ఉద్యోగులు, కోట్లాది మంది ప్రజలు కష్టపడి తమ రక్తంతో, స్వేదం చిందించారని గుర్తు చేశారు. హైదరబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం మాజీ మంత్రి కేటీఆర్ స్వేద పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎక్కడికి చేరుకున్నామో తెలియాలంటే ఎక్కడ మొదలు పెట్టామో గుర్తు పెట్టుకోవాలంటరని తెలిపారు. విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ది వైపు ఈ ప్రయాణం జరిగినట్టు చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే భారత దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యామని వివరించారు. 60 ఏండ్ల సమైక్యపాలనలో ఉద్దేశ్యకపూర్వక నిర్లక్ష్యం, విధ్వంస పాలనలో సమైక్య రాష్టంలో చూశామని చెప్పారు. అది కాంగ్రెస్ వాళ్లు కావొచ్చు ఇతరుల వల్ల కావొచ్చు పూర్తిగా చిక్కిశల్యమైన ప్రాంతామన్నారు. తాము చేసిన అభివృద్దిపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పారు. గత పదేండ్లు మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి మేం పదేండ్లలో ఏం చేసినమో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. అందుకోసమే స్వేద పత్రం విడుదల చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ నాయకులు శ్వేత పత్రం శ్వేత పత్రం అంటూ హడావిడి చేసి చివరకు వాయిదా వేసుకొని పారిపోయిందని ఎద్దెవా చేశారు.
బావా నువ్వు కూసో.. నేను నడుపుతా.. ఒకే కారులో మాజీ మంత్రులు
తమ ప్రభుత్వం రూ. 3.17 లక్షల కోట్లు అప్పులు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 6.70 లక్షల కోట్లుగా చూపిందని ఆరోపించారు. ఇచ్చిన రుణాలు ఇవ్వని రుణాలకు కూడా అప్పులుగా చూపుతున్నారని కాంగ్రెస్ సర్కార్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి స్థూలంగా ఉన్న అప్పు రూ.3,17,051 కోట్లు మాత్రమేనన్నారు. లేని అప్పును ఉన్న అప్పుగా చూపెడుతూ తిమ్మిని బమ్మి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ, విద్యుత్ , పౌరసరఫర శాఖల్లో లేని అప్పులను ఉన్నట్టుగా చూపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. పౌరసరఫరాల సంస్థకు ఇప్పటి వరకు ఉన్న అప్పు రూ. 21,029 కోట్లు మాత్రమేనని ఆయన చెప్పారు.నిల్వలు, కేంద్రం నుండి రావాల్సిన డబ్బులను దాచి అప్పులు ఎక్కువగా ఉన్నాయని చూపారని కేటీఆర్ విమర్శించారు. జనాభా ఆధారంగా తెలంగాణ వాటా అంటూ తప్పుడు లెక్కలు చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆకాశమంత ఎత్తులో అగ్రస్థానంలో ఉందని ఆయన స్ఫష్టం చేశార. తెలంగాణాకు ఆస్థిత్వమే కాదు, ఆస్తులు కూడ సృష్టించామని కేటీఆర్ వివరించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ తెలంగాణాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నం చేశామన్నారు.
Watch live: BRS Party Working President @KTRBRS giving a PowerPoint presentation (Swedha Pathram). https://t.co/ihhEoqvcbX
— BRS Party (@BRSparty) December 24, 2023
ఆ బస్సులను అక్కడే ఆపుతాం… మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేసిన ఆర్టీసీ ఏండీ సజ్జనార్
పల్లవి ప్రశాంత్ తప్పు చేశాడా..?
బావా నువ్వు కూసో.. నేను నడుపుతా.. ఒకే కారులో మాజీ మంత్రులు
శ్వేత పత్రానికి కౌంటర్ స్వేద పత్రం.. దెబ్బతీస్తే సహించం కేటీఆర్