Local News” ఘనంగా బ్రహ్మంగారి ఆరాధన దినోత్సవం…
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం మండల అధ్యక్షుడు సదానంద చారి…
శంకరపట్నం డిసీ ప్రతినిధి
కాలజ్ఞానం తత్వవేత్త సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపులు శ్రీ గోవిందా మాత సమేత శ్రీ విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి దినమును పురస్కరించుకొని బుధవారం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మల ఐక్య సంఘం మండలాధ్యక్షుడు తాటికొండ సదానంద చారి ఆధ్వర్యంలో ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు, కన్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ తాటికొండ సదానంద చారి మాట్లాడారు. కాలజ్ఞానం తత్వవేత్త సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపులు కలియుగంలో ఈరోజు ఏం జరుగుతుందనే విషయాన్ని ముందే గ్రహించి ప్రజలకు తత్వ బోధన చేసిన మహనీయులు శ్రీ గోవిందా మాత సమేత శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి అయిన దినాన్ని మండలంలోని కేశవపట్నం శివారులో గల వెంకయ్య గుట్ట వద్ద గల స్వామివారి మఠం వద్ద, ఘనంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించినట్లు సదానంద చారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నర్సింగోజు కృష్ణ చారి, మంటేనా రవీంద్రాచారి ప్రధాన కార్యదర్శి, కొండపాక ప్రసాద్ చారి, ప్రచార కార్యదర్శి కస్తూరి రామచంద్రం, నాయకులు రవీంద్ర చారి, సంతోష్ చారి, శంకర్, రాజు, లింగమూర్తి ,శ్రీనివాస్, భద్రాచరి, వెంకటేశ్వర్లు, నరేష్ ,తదితరులు పాల్గొన్నారు.
——————————————-
సంక్షేమ పథకాల లబ్ధి కోసం ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి…
ఏడిఏ శ్రీధర్…
శంకరపట్నం డిసీ ప్రతినిధి

రైతులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని మానకొండూర్ సహాయ వ్యవసాయ శాఖ సంచాలకులు ఏడీఏ శ్రీధర్ రైతులకు సూచించారు. బుధవారం కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల రైతు వేదికలో మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్, కార్యక్రమాన్ని క్షేత్రస్థాలు పరిశీలించి ఏ డి ఎస్ శ్రీధర్ మాట్లాడారు. రైతులు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రైతుల వ్యవసాయ భూములను, ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని, రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించి తమ వ్యవసాయ భూములను ఆన్లైన్ లో పొందుపరచుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకట్, తాడికల్ గ్రామ ఏఈఓ, రైతుల తదితరులు పాల్గొన్నారు.
///////////////////////////////////////////////////////////////////////////////////
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలు..
శంకరపట్నం డిసీ ప్రతినిధి

వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో కేశవపట్నం హనుమాన్ ఆలయంలో గీత పారాయణం, అంబేద్కర్ విగ్రహం వద్ద కన్యకా పరమేశ్వరి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండ్లు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్, హుజరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తణుకు ప్రభాకర్, వైశ్య సంఘం నాయకులు తనకు ఓంకారం, తణుకు సత్యనారాయణ, పాలడుగుల బాపన్న, సోమేశ్వర్, వంగ సత్య
