Local News” కాంగ్రెస్ ఓబీసీ జాతీయ అధ్యక్షుడిని కలిసిన సంజయ్ నేత….
శంకరపట్నం డిసీ ప్రతినిధి..

కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడిని ఢిల్లీ లోని పార్టీ కార్యాలయంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ బుధవారం కలిశారు. బీసీ కులగణన కోసం కృషి చేయాలని వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని కోరారు. తెలంగాణ బీసీ బిల్లును అమలులోకి తీసుకురావాలని ఆ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగ భద్రత కల్పించాలన్నారు. బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో గత నెల పదిహేను రోజులుగా ఢిల్లీలో మకాం వేసి అన్ని రాజకీయ పార్టీలను కలుస్తూ, పార్లమెంట్లోని అందరూ ఓబీసీ ఎంపీలను కలుస్తూ ఢిల్లీలో పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయానికి వెళ్లి నూతన ఓబీసీ విభాగ చైర్మన్ అనిల్ జైహింద్ ను కలిసి తమ పోరాటానికి మద్దతు తెలిపాలని కోరినట్టు చెప్పారు. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. బిసి ఆజాది ఉద్యమానికి మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్లు సంజయ్ కుమార్ వెల్లడించారు.
/////////////////////////////////////////////////////////////////////////////
తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ సహాయకులుగా రహీం బాధ్యతల స్వీకరణ…
శంకరపట్నం డిసీ ప్రతినిధి…
శంకరపట్నం మండల తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ సహాయకులుగా ఎండి రహీం బుధవారం బాధ్యతలు స్వీకరించినట్లు తహసిల్దార్ బత్తుల భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా తహసిల్దార్ భాస్కర్ మాట్లాడారు. రామడుగు మండలం తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఎండి రహీం సాధారణ బదిలీల్లో భాగంగా శంకరపట్నం మండలం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం బాధ్యతలు స్వీకరించినట్టు తెలిపారు.
//////////////////////////////////////////////////////////////////////////////////
తెలంగాణ సాహితి పురస్కారం అందుకున్న మొలంగూర్ వాసి…
హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు…
శంకరపట్నం డిసీ ప్రతినిధి…

తెలంగాణ సాహితీ సంస్థ అందజేసే పురస్కారానికి మొలంగూర్ గ్రామవాసి కనకం శ్రీనివాస్ ఎంపికై తెలంగాణ సాహితీ పుష్కారాన్ని అందుకున్నారు. కరీంనగర్ జిల్లా ,శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామానికి చెందిన కనకం శ్రీనివాస్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్తర్తిస్తున్నాడు. తెలంగాణ సాహితి కరీంనగర్ శాఖ, 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని, తెలంగాణ సాహితీ సంస్థ నిర్వహించిన, నేటి సమాజానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బావజాలం ఆవశ్యతపై వ్యాస రచన లు నిర్వహించారు. ఇందులో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడైన కనకం శ్రీనివాస్ కు ప్రథమ బహుమతి తో పాటు నగదు పురస్కారం అందుకున్నారు. దీనిపై మొలంగూర్ తాజా మాజీ సర్పంచ్ మోరె అనుష శ్రీనివాస్, గ్రామవాసులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణంలో శ్రీనివాసులు తెలంగాణ సాహితీ సంస్థ సన్మానం చేసి సాహితి పురస్కారాన్ని అందించినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో.నిర్వాహకులు రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి మాడుగుల రాములు, మడుగు మనువాడ శంకర్ ,కవులు అన్నవరం దేవేందర్, పీవీ రాజ్ కుమార్ శంకరయ్య, నసిరుద్దీన్ గసికంటి సంజీవ్, సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి,నిర్వాహకులు, సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
