ఆడపిల్లలకు ఆర్థికంగా భరోసానిచ్చేందుకు ఏర్పాటు చేసిన మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఎంతో మంది ఆడబిడ్డలకు అండగా నిలుస్తోంది. తాజాగా ఏడో తరగతి చదువుతున్న అమ్మాయికి మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ వారు శనివారం స్కూల్ ఫీజు చెల్లించి తమ ఔదర్యాన్నిచాటుకున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లి గ్రామానికి చెందిన ఇడుగునూరి జమున జీవనోపాధి కోసం కరీనంగర్ లో నివాస ఉంటోంది. ఈ క్రమంలో కరోనా కాలం నుంచి ఉపాధి సరిగా లేక కుటుంబ అవసరాల ఇబ్బంది పడుతోంది. ఆమె బిడ్డ అంజలి నగరంలోని రత్నం గ్లోబల్ స్కూల్‌లో ఏడో తరగతి చదుతున్న క్రమంలో ఆ అమ్మాయి ఫీజు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ రేండ్ల శ్రీనివాస్ శ్రీరామమ్ (దుబాయ్) వాట్సప్ గ్రూప్ సభ్యులకు సమస్యను వివరించారు. స్పందించిన వాట్సప్ గ్రూప్ సభ్యులు రూ. 15 వేలు ఆర్థిక సహాయం చేయడంతో మా ఊరి మహాలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ శ్రీనివాస్ పద్మ చేతుల మీదుగా స్కూల్ యాజమాన్యానికి శనివారం అందజేశారు. శ్రీరామమ్ వాట్సప్ గ్రూప్ సభ్యులను, మా ఊరి మహాలక్ష్మిఫౌండర్లను పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి
ఆహారం పెట్టిన పిల్లవాడు.. బుడ్డోడిని పైకి లేపిన జీరాఫి.. వీడియో వైరల్
Punam pandey నేను చనిపోలేదు.. ఇదంతా నాటకమంతే.. క్యాన్సర్‌పై అవగాహనకోసమే..
holiday” ఫిబ్రవరి 8న సాధారణ సెలవు
Bharata-Ratna”ఎల్ కే అద్వానికి భారత రత్న… మోదీ ఏమన్నారంటే