-huzurabad-acp” పోలీస్ అధికారుల ఘన స్వాగతం
– శంకరపట్నం డిసి ప్రతినిధి
హుజురాబాద్, మే 22:
హుజురాబాద్ డివిజన్ పోలీస్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి)గా వి. మాధవి గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం డివిజన్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల నుండి వచ్చిన అధికారులంతా ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మాధవిని హుజురాబాద్ టౌన్, ఇతర స్టేషన్ల అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పరిధిలోని పలువురు పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
