Urea Crisis” టిఆర్ఎస్, బిఆర్ఎస్ ప్రభుత్వంలో లేని కష్టాలు..
రైతుల పక్షపాతి నాటి టిఆర్ఎస్, బిఆర్ఎస్ ప్రభుత్వం…
రైతులను విస్మరిస్తున్న నేటి కాంగ్రెస్ ప్రభుత్వం..
వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చౌడమల్ల…
శంకరపట్నం :డిసి ప్రతినిధి:
ప్రత్యేక రాష్ట్రంలో గడిచిన 10 సంవత్సరాలలో రైతులకు యూరియా కోసం ఎలాంటి కష్టం లేదని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారని, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, సీనియర్ న్యాయవాది చౌడ మల్ల వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నాటి టీఆర్ఎస్, బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ చూపించి, రైతులకు వ్యవసాయం కోసం కావలసిన ఎరువులపై ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రైతులను విస్మరించి రైతులకు కావలసిన ఎరువులను దిగుమతి చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వర్షాకాలం పంటలు సాగుచేసి నెలలు గడుస్తున్న యూరియా అంధక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొత్త ఏర్పడడంతో రైతులు వేసిన పంటలు చేతికి అంది వస్తాయో రావని ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము యూరియా కొరత కోసం ప్రత్యేక చర్యలు తీసుకొని రైతులకు ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం చేస్తే రైతుల పక్షాన ఆందోళనలు చేస్తామని వీరస్వామి హెచ్చరించారు.

BIGGIE BEAN BAG
ఇప్పుడు మీ హాల్, బెడ్‌రూం లుక్ మార్చేసే టైం!
⚽ స్పోర్ట్స్ థీమ్ లో అదిరిపోయే డిజైన్
️ 4XL సైజ్ – గమ్మత్తైన సోఫా కంఫర్ట్
✅ రెడీ ఫిల్డ్ – ఎలాంటి హాసిల్ లేదు
ఫ్రీ కుషన్ & ఫుట్‌రిస్ట్ తో అదనపు కంఫర్ట్
మెరుస్తున్న ఫాక్స్ లెదర్ ఫినిష్
బ్లాక్ & గ్రీన్ స్పోర్ట్స్ మూడ్ కలర్
ఇలాంటిది మీ గది లో ఉండాలి గదా?
అడుగు పెట్టండి – కంఫర్ట్ & స్టైల్ ఒకేసారి!
అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/45Ud8yR లింక్ పై క్లిక్ చేయండి..
