Adluri lakshman” మాదిగలకు అండగా ఉంటూ సేవ చేస్తా: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Adluri lakshman” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
“మాదిగలకు సేవ చేయడం విషయంలో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటా,” అని రాష్ట్ర ఎస్సీ-ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరులోని కేఎంఆర్ ఉన్నతి కన్వెన్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని మాదిగ అఫీషియల్ కాంగ్రెస్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

కష్టం తెలిసిన వాడిని, అందుకే అందరి సంతోషాల్లో భాగం

మంత్రిగా ప్రసంగించిన లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, “నన్ను మీలాంటి సామాన్య ప్రజలే మంత్రి స్థాయికి తీసుకువచ్చారు. జెడ్పిటిసిగా ఉన్నప్పుడు అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. అదే కసితో జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు నాలుగు కీలక శాఖలకు బడ్జెట్ కేటాయించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి నాకు అప్పగించడం గర్వంగా ఉంది” అని చెప్పారు.

వర్గీకరణతో వెలుగుతున్న మాదిగల జీవితం

ఈ కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, మాదిగలు ‘మాదిగ’ అని చెప్పుకోవడానికి భయపడిన స్థితి నుంచి, గర్వంగా చెప్పే స్థాయికి వచ్చారని పేర్కొన్నారు. వర్గీకరణతో మాదిగల జీవితం మెరుగవుతుందని, మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ఫలితంగా ఇది సాధ్యమైందని కొనియాడారు.

మోతుకు పెళ్లి నరసింహుల పోరాటం కూడా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యలో మాదిగల భాగస్వామ్యం తగ్గిపోతున్నదన్నది ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. “విద్యే భవిష్యత్‌కు బలమైన పునాది” అని సూచించారు.

జాతి గౌరవాన్ని నిలబెట్టిన మాదిగలు

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ, మాదిగలు జాతీయ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారని అన్నారు. “దేశ సైనికులకు చెప్పులు కుట్టిన ఘనత మాదిగలకు దక్కుతుంది. పోలియో మందు ఇచ్చిన తొలి జాతి కూడా మాదిగలదే,” అంటూ గర్వంగా చెప్పారు.

జగ్జీవన్ రామ్ వంటి నేతల వల్లే దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దళితులకు తగిన మేలు జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నిరుపేదల కోసం ఇళ్లు ఇస్తున్నారన్నారూ, మాదిగ జాతి తరఫున రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఒకతాటిపైకి రావాల్సిన అవసరం

వర్గీకరణ సాధ్యం కావడంతో సమాజంలో మాదిగల పాత్ర బలపడింది. అయితే, ఇక్కడితో తృప్తి చెందకూడదని సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించబోయే 10 లక్షల మంది మాదిగల ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

బీజేపీ సామాజిక న్యాయం చేయలేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “మా ఆహారపు అలవాట్లు, మాట, యాసలపై ఎవరికీ ఆంక్షలు విధించే హక్కు లేదు,” అని స్పష్టం చేశారు.

కళకళలాడిన ఆత్మీయ సమ్మేళనం

ఈ కార్యక్రమంలో ఉస్మానియా ప్రొఫెసర్ చింతకింది ఖాసిం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, ప్రముఖ మాదిగ నేతలు సోమన్న తదితరులు పాల్గొన్నారు. వేదికపై పలువురు మాదిగ యువత, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు సందడి చేశారు.

Millet-Biscuits“పుట్టిందీ పల్లెలో… చేరింది ప్రపంచంలో!”.. మెచ్చిన ప్ర‌ధాని మోడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *