Indiramma Sakti Sabha” మహిళల ఆర్థిక ఎదుగుదల ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: వివో అధ్యక్షురాలు జహేదా

Indiramma Sakti Sabha”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా

 రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని మహిళా సంఘాల వివో అధ్యక్షురాలు జహేదా తెలిపారు. బుధవారం  శంకర పట్నం మండలం, మొలంగూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ మహిళా శక్తి సదస్సులో ఆమె ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో మహిళా సంఘ సభ్యులతో జరిగిన సమావేశంలో జహేదా మాట్లాడుతూ.. “తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు, మహిళలను వ్యాపార రంగాల్లోకి ప్రోత్సహించి ఆర్థికంగా ముందుకు నడిపిస్తోంది. ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమం ద్వారా బ్యాంకుల సహకారంతో మహిళలకు వ్యాపార రుణాలు అందజేయడం జరుగుతోంది,” అని చెప్పారు.

ఈ నెల 18 వరకు గ్రామ స్థాయిలో జరుగుతున్న ఇందిరమ్మ మహిళా శక్తి సమావేశాలు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మహిళలు ఈ సమావేశాలను సద్వినియోగం చేసుకొని, అందుబాటులో ఉన్న సంక్షేమ పథకాల ద్వారా వ్యాపార రంగంలో రాణించాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివోఏలు అజీమా, లలిత, మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Kerala King Cobra” 18 అడుగుల నాగు…. ధైర్యంగా ప‌ట్టుకున్న లేడీ ఆఫీస‌ర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *