Man-ki-Baat” కొత్తగట్టులో మన్ కి బాత్ కార్యక్రమం వీక్షించిన బీజేపీ జిల్లా నాయకులు

Man-ki-Baat”  శంకరపట్నం, డిసి ప్రతినిధి:

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన “మన్ కి బాత్” కార్యక్రమాన్ని ఆదివారం కరీంనగర్ జిల్లా బీజేపీ నాయకులు ఉత్సాహంగా వీక్షించారు. ఈ కార్యక్రమం మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలోని 85వ పోలింగ్ బూత్ వద్ద నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, మండల నాయకులు, బూత్ ఇన్‌చార్జ్‌లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ..

“మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా రైతుల గురించి మన్ కి బాత్‌లో ప్రస్తావించడం గర్వకారణ‌మన్నారు. మహిళా రైతులు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తూ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్న దృశ్యాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు,” అని పేర్కొన్నారు.

 

“తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నార‌ని చెప్పారు. రైతుల అభివృద్ధికి, మహిళల సమర్థతకు తోడ్పడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంద‌న్నారు. జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు కొనసాగుతున్నాయ‌న్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్నవారు:

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి

మండల ఉపాధ్యక్షుడు సుదగోని శ్రీనివాస్ గౌడ్

బూత్ అధ్యక్షులు నల్ల జయపాల్ రెడ్డి, బోడ అనిల్

సీనియర్ నాయకులు మాడుగుల వెంకట్ రెడ్డి, నల్ల తిరుపతి రెడ్డి, మహేష్, పవన్, గుర్రం సంతోష్, మీస బిరాయ్యా, రామగిరి సంపత్, కతారమల్ల దిలీప్, బొంగొని రాజు, ఉమ్మెత్తల సందీప్ రెడ్డి, రాజిరెడ్డి, అనేక మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *