ZphsTadikal” గురువులను ఘనంగా సన్మానించిన విద్యార్థులు..
శంకరపట్నం: డిసి ప్రతినిధి
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అలనాటి స్మృతులను గుర్తుచేసుకొని ఒకరు ఒకరు ఆప్యాయతను పంచుకున్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని తాడికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004/2005 సంవత్సరములో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మండలంలోని మొలంగూర్ శివారులో గల లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించి పూర్వము విద్యాభ్యాసం చేసిన గురువులను ఘనంగా పూలమాలలతో శాలువాలతో సత్కారం చేసి గురుత్తర కృతజ్ఞతలు తెలిపి ఆత్మీయ సమ్మేళనంలో విద్యా అర్ధి దశలో అలనాటి స్మృతులను గుర్తుచేసుకొని ఒకరికొకరు ఆప్యాయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వం విద్యాభ్యాసం చేసిన గురువులు, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ZphsTadikal” పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం…
