Mla Kavvampalli” ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇంట విషాదం..

అనారోగ్య సమస్యలతో రెండో అన్న రాజేశం మృతి..

రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారుల నివాళి

అంతిమయాత్రకు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు..

Mla Kavvampalli”  శంకరపట్నం :డిసి ప్రతినిధి: మానకొండూరు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఇంట విషాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజాము రెండో సోదరుడు కవ్వంపల్లి రాజేశం అలియాస్ పాల్ (67)తుది శ్వాస వదిలారు. రాజేశం గత నెల రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లో అధునాతన వైద్య చికిత్స అందినప్పటికీ పరిస్థితి విషమించిపోవడం తో రాజేశం ను హైదరాబాద్ ఆసుపత్రి నుంచి కరీంనగర్ లోని ఇంటికి తరలించారు. ఇంటికి చేరిన కొద్దిసేపటికే ఆయన తుది శ్వాస విడిచారు. రాజేశం కు భార్య, కుమారుడు,కుమార్తె ఉన్నారు. మృతి విషయం తెలియగానే జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు అధికారులు రాజేశం స్వగృహానికి తరలివచ్చి ఆయన భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు రాజేశం కుటుంబ సభ్యులను, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఓదారుస్తూ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కరీంనగర్ లోని వాల్మీకి నగర్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర అంగడి బజార్, గాంధీ రోడ్ మీదుగా కిసాన్ నగర్ లోని శ్మశాన వాటికకు చేరింది. అంతకు ముందు కిసాన్ నగర్ లోని చర్చ్ లో రాజేశం పార్థివ దేహానికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కిసాన్ నగర్ లో గల గ్రేవ్ యార్డ్ లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే సత్యనారాయణను ఫోన్లో పరామర్శించి సోదరుని మృతి పై అడిగి తెలుసుకుని తన సంతాపం వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆరె పల్లి మోహన్, ఆర్డీవో మహేశ్వర్, సివిల్, ట్రాఫిక్ ఏ సీపీలతోపాటు పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు పురమల్ల శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్, నగర మండల పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నందగిరి రవీంద్ర చారి, గోపగోని బసవయ్య గౌడ్, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి తిరుపతి, బండారు రమేష్, అక్కరవేణి పోచయ్య ముదిరాజ్, ముక్కిస రత్నాకర్ రెడ్డి, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు మర్రి ఓదెలు యాదవ్, పులి కృష్ణ, పార్టీ నాయకులు తుమ్మెనపల్లి శ్రీనివాసరావు, గంకెడి లక్ష్మారెడ్డి,బుదారపు శ్రీనివాస్, బి.రాఘవరెడ్డి, తాళ్లపల్లి సంపత్ గౌడ్, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య యాదవ్, పసుల వెంకటి, అలవాల కోటి, మాతంగి అనిల్, కొమ్మెర దేవేందర్ రెడ్డి, మడుపు శ్యామ్, ప్రేమ్ కుమార్, కొండ్ర సురేష్, కనకం అశోక్,తాళ్లపల్లి నరేష్ గౌడ్, బక్కారెడ్డి,గొల్లెన కొమురయ్య, తీగల పుష్పలత , బందెల మహేందర్, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, బండారు తిరుపతి, కరీంనగర్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

BIGGIE BEAN BAG
ఇప్పుడు మీ హాల్, బెడ్‌రూం లుక్ మార్చేసే టైం!

⚽ స్పోర్ట్స్ థీమ్ లో అదిరిపోయే డిజైన్
️ 4XL సైజ్ – గమ్మత్తైన సోఫా కంఫర్ట్
✅ రెడీ ఫిల్డ్ – ఎలాంటి హాసిల్ లేదు
ఫ్రీ కుషన్ & ఫుట్‌రిస్ట్ తో అదనపు కంఫర్ట్
మెరుస్తున్న ఫాక్స్ లెదర్ ఫినిష్
బ్లాక్ & గ్రీన్ స్పోర్ట్స్ మూడ్ కలర్

ఇలాంటిది మీ గది లో ఉండాలి గదా?
అడుగు పెట్టండి – కంఫర్ట్ & స్టైల్ ఒకేసారి!
అమెజాన్‌లో కొనేందుకుhttps://amzn.to/45Ud8yR  లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *