నిన్న‌టి రోజు మ‌న‌ది కాదు… డ్రెస్సింగ్ రూంలో క్రికెట‌ర్ల‌ను ఓదార్చిన మోడీ

వ‌ర‌ల్డ్ క‌ప్ చివ‌రి మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాతో జ‌రిగిన క్రికెట్ మ్యాచ్‌లో భార‌త్ ఓట‌మి పాల‌య్యింది. భార‌మైన హృద‌యంతో డ్రెస్సింగ్ రూం చేరుకున్న క్రికెట‌ర్ల‌కు అంద‌రూ మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. అనుష్య విరాట్ ను హ‌త్తుకుని ఓదార్చింది. అలాగే భార‌త అభిమానులు కూడా త‌మ‌దైన శైలిలో క్రికెట‌ర్ల‌కు బాస‌ట‌గా నిలిచారు. భార‌త ప్ర‌ధాని కూడా డ్రెస్సింగ్ రూం చేరుకుని క్రిక‌ట‌ర్ల‌ను ఓదార్చారు. దీనిపై మ‌హ్మ‌ద్ ష‌మీ ఓ ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.

దురదృష్టవశాత్తు నిన్న మన రోజు కాదు. టోర్నీ అంతటా మా జట్టుకు, నాకు మద్దతుగా నిలిచినందుకు భారతీయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. PM కి ధన్యవాదాలు
@నరేంద్రమోదీ
ప్రత్యేకంగా డ్రెస్సింగ్ రూమ్‌కి రావడం మరియు మా ఉత్సాహాన్ని పెంచడం కోసం. మేము తిరిగి బౌన్స్ చేస్తాము!

 

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

విరాట్‌ను హ‌త్తుకుని ఓదార్చిన అనుష్క‌

ఆ గ్రామంలో పుట్టిన ప్ర‌తి ఆడ‌పాప‌కు రూ. ఐదు వేల ఆర్థిక సాయం రేండ్ల శ్రీ‌నివాస్ ఔదార్యం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *