Brs” శంకరపట్నం: డిసీ ప్రతినిధి
రాష్ట్రంలోని రైతుల కష్టాలు చూస్తూనే ఉండగానే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భూస్థాపితం అవుతోందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, మాజీ జెడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.
సోమవారం, బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్ర జాతీయ రహదారిపై భారీ ధర్నా, రాస్తారోకో, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, గత 10 ఏళ్ల టీఆర్‌ఎస్/బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు ఎరువుల కొరత లేకుండా, ముందస్తు ప్రణాళికలు రూపొందించి, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించి, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాష్ట్రానికి యూరియా, ఎరువులు సమృద్ధిగా అందించారని గుర్తు చేశారు.
కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా, రైతుల అవసరాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఎరువుల కొరత తలెత్తి, రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సన్న వడ్ల బోనస్ ఇప్పటికీ రైతులకు చెల్లించకపోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు.
రైతులకు తక్షణం యూరియా అందజేయాలని, బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలో పాల్గొన్న నేతలు ప్రభుత్వంపై నినాదాలు చేశారు. రైతుల ఉసురుతో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే భూస్థాపితమవుతుందని నేతలు వ్యాఖ్యానించారు.
ఈ ధర్నాకు సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు అక్కడకు చేరుకొని, నాయకులతో మాట్లాడి శాంతియుతంగా ప్రదర్శన ముగించేలా చర్చించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
-
మండల అధ్యక్షుడు గంట మహిపాల్
-
మాజీ జెడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాసరెడ్డి
-
మాజీ సర్పంచులు: గోపు విజయ్ కుమార్ రెడ్డి, కొండ్ర రాజయ్య, మోరె అనూష శ్రీనివాస్, మోత్కూరి సమ్మయ్య, చీరాల శేషాచార్యులు, నిలవేణి సుష్మ మహేష్
-
మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు పరుశరాములు
-
మాజీ ఎంపీటీసీలు: గాండ్ల తిరుపతి, గుర్రం రామస్వామి, మచ్చ గిరింద్ర స్వామి
-
మాజీ చైర్మన్ సాగి మలహల్ రావు
-
మండల ఉప సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు గజ్జల్లి హనుమంతు
-
కేశవపట్నం గ్రామ శాఖ అధ్యక్షుడు మేకల కుమార్
-
ఇతర నాయకులు: తిరుపతి రెడ్డి, సతీష్ రెడ్డి, రమేష్, పార్థసారథి, తిరుపతి, మొగిలి, శ్రీనివాసరెడ్డి
-
వివిధ గ్రామాల శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

✨ బోష్ 9Kg ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషిన్
5 స్టార్ రేటింగ్ | AI Active Water+ | Anti-Stain Power
ఇన్-బిల్ట్ హీటర్, Allergy Plus, Iron Steam Assist
Anti Tangle, Anti Wrinkle టెక్నాలజీ
Dark Silver లుక్స్‌తో ప్రీమియం ఫినిష్
ధర: ₹38,990 మాత్రమే! (25% తగ్గింపు)
200+ మంది గత నెలలో కొనుగోలు చేశారు!
అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/3JxC32I లింక్ పై క్లిక్ చేయండి
