Mla Kavvampalli” శంకరపట్నం డిసీ ప్రతినిధి
నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా , మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని, గొల్లపల్లెలో నూతన గ్రామ పంచాయతీని ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వము సంక్షేమ పథకాలను అందజేసి ప్రజా అభివృద్ధి ద్యేయంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నిధులు విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి టిపిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, గ్రామ మాజీ సర్పంచ్ ఉడిగే రజిత తిరుపతి, ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, ఎంపీఓ కాసగోని ప్రభాకర్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చింతి రెడ్డి పద్మ, బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కవ్వపద్మ, శ్రీ మత్స్య గిరింద్ర స్వామి దేవస్థానం చైర్మన్ కోరెం రాజిరెడ్డి, మాజీ చైర్మన్ ఉప్పుగల్లు మల్లారెడ్డి, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిరుపతి గౌడ్, జిల్లా కార్యదర్శి బండారి తిరుపతి, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఆడెపు అజయ్, మానకొండూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహమ్మద్ షారుక్, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
