karimnagar” కరీంనగర్ | శంకరపట్నం:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామంలో క్రికెట్ క్రీడాకారులకు గ్రామ ఉపసర్పంచ్ దండు రాజేష్ సంక్రాంతి పండగను పురస్కరించుకొని క్రికెట్ బ్యాట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ రాజేష్ మాట్లాడుతూ, గ్రామంలోని యువత క్రీడల్లో ముందుకు రావాలని, వారి అభివృద్ధికి తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. క్రీడాకారులు కోరిన మేరకు క్రికెట్ బ్యాట్లను కొనుగోలు చేసి అందజేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు మోరె గణేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నేరెళ్ల సంతోష్‌తో పాటు గ్రామ యువకులు, క్రికెట్ క్రీడాకారులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం ఘనంగా సంక్రాంతి పండుగ సంబరాలు నిర్వహించారు.
తెల్లవారుజామునే మహిళలు ఇళ్ల ముందు ప్రాంగణాలను శుభ్రపరిచి కల్లాపు చల్లి రంగవల్లులు అద్దగా వేసి బొబ్బిళ్ళను పెట్టి నవధాన్యాలు సమర్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sankranthi” గతంలో 14 తేదీ, ఇప్పుడు 15 తేదీ.. ఎందుకో ఈ వస్తుందో తెలుసా.. 72 ఏళ్లకు ఒకరోజు మార్పు
Makara Sankranti”చలికాం ముగిసిపోయి..వెచ్చని అడుగులు.. సంక్రాంతి విశేషాలివే
