Gangipalli Saibaba” సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రత్యేక పూజలు

Gangipalli Saibaba”  శంకరపట్నం డిసీ ప్రతినిధి:
గురు పౌర్ణమి సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు గురువారం రోజు మానకొండూర్ మండలం గంగిపల్లి గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఎమ్మెల్యేకు ఆశీర్వాదాలు అందించారు. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

పార్టీ నేతల సందడి

ఎమ్మెల్యే వెంట మానకొండూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి, పార్టీ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, వాల అంజిత్ రావు, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ పూజల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి దివ్య దర్శనం పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *