Delhi Earthquake” న్యూఢిల్లీ, జూలై 10 (RNA):
దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో గురువారం ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. ఉదయం 9:04 గంటలకు నమోదైన ఈ భూప్రకంపనలు ప్రజలను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేశాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.4గా నమోదైంది.
భూకంప కేంద్రం హర్యానా రాష్ట్రంలోని జజ్జర్ ప్రాంతం, భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉండటాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు నోయిడా, గజియాబాద్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ప్రకంపనలు అనుభవించబడ్డాయి.
ప్రజలు భయంతో రోడ్లపైకి
ప్రకంపనలు కొన్ని సెకన్లపాటు కొనసాగినప్పటికీ తీవ్రత మరింతగా ఉండటంతో ప్రజలు ఇళ్లలోనుంచి, కార్యాలయాలనుంచి రోడ్డులపైకి పరుగులు తీశారు. లిప్ట్‌లను ఉపయోగించకుండా మెట్ల ద్వారా కిందకు రావాలని ఎన్డీఆర్ఎఫ్ సూచించింది.
అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు. ప్రస్తుతం ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రకంపనలు స్థానికుల్లో మరింత ఆందోళనకు కారణమవుతున్నాయి.
ఎన్డీఆర్ఎఫ్ సూచనలు:
-
భూమి కంపించేటప్పుడు శాంతంగా ఉండాలి
-
లిఫ్టుల బదులుగా మెట్ల ద్వారా కిందకు రావాలి
-
ఓపెన్ ఏరియాలైన పార్కులకి వెళ్లాలి
-
ఫేక్ న్యూస్‌లను నమ్మకూడదు
