Moharram 2025″
హిందూ ముస్లింల ఐక్యతతో జాతర, ఊరేగింపులు ఘనంగా నిర్వహణ
శంకరపట్నం డిసీ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని మొలంగూర్ గ్రామంలో ఆదివారం మతసామరస్యానికి ప్రతిరూపంగా మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. హిందూ ముస్లింల సోదరభావంతో ఈ వేడుకలు పలు గ్రామాలలో జరగడం విశేషం.
గ్రామాలు: మొలంగూర్, కేశపట్నం, తాడికల్, అంబాల్‌పూర్, కరీంపేట్, రాజాపూర్ తదితర ప్రాంతాల్లో తొమ్మిది రోజులపాటు ఉపవాస దీక్షలు నిర్వహించి, ఆదివారం రోజున భారీ ఊరేగింపులు, జాతర, మరియు రాత్రి నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి.
మలంగ్ షావలి దర్గాలో ఉర్సు ప్రత్యేక ఆకర్షణ
ప్రతి ఏడాది మొలంగూర్ గ్రామంలోని దూద్ బావి ఖిల్లా వద్ద గల మలంగ్ షావలి దర్గాలో ప్రత్యేక ఉర్సు జాతర నిర్వహించబడుతుంది.
-
సోమవారం: ముస్లిం సోదరులు గంధంతో దర్గాలో ఊరేగింపుగా ప్రవేశిస్తారు.
-
మంగళవారం: పురుషుల ఉర్సు జాతర నిర్వహించబడుతుంది.
-
మహిళల ప్రవేశం ప్రత్యేకత: ఉర్సు సందర్భంగా మహిళలకు దర్గాలో ప్రవేశం అనుమతించి, వారు మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పించడం ప్రత్యేకతగా నిలుస్తోంది.
