Molangur” ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటాం…

Molangur”  మొలంగూర్ లో తాసిల్దార్ క్షేత్రస్థాయి పరిశీలన..
తాసిల్దార్ సురేఖ…
శంకరపట్నం డిసి ప్రతినిధి…
ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, శాఖ పరంగా చర్యలు తీసుకుంటామని, ఆక్రమణదారులకు రెవెన్యూ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం నోటీసులు అందించి చర్యలు, తీసుకుంటామని గ్రామ ప్రత్యేకాధికారి, తాసిల్దార్ కే సురేఖ అన్నారు.

క్షేత్ర స్థాయి ప‌రిశీల‌న

బుధవారం కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో 703 ప్రభుత్వ భూమి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్, మోరె గణేష్ జిల్లా కలెక్టర్ కు మొలంగూర్ లో ప్రభుత్వ భూమి703 సర్వే నంబర్లు ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశార‌ని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశం మేర‌కు మొలంగూర్ గ్రామంలో గతంలో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి, హద్దులు నిర్ణయించినారన్నారు. ఈ నేప‌థ్యంలో గణేష్ ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినట్లు వెల్లడించారు.
నోటీసులు అంద‌జేస్తాం..

రెవెన్యూ శాఖ పరంగా, పంచాయతీరాజ్ శాఖ పరంగా ఆక్రమణదారులకు నోటీసులు అందజేసి ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని స్వాధీనము చేసుకొని మొలంగూర్ గ్రామంలో ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం శాఖ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సురేఖ తెలిపారు.

హ‌ద్దులు నిర్ణ‌యించండి..
రైతు పొద్దుటూరి సంజీవరెడ్డి.
మాజీ జెడ్పిటిసి , సింగిల్ విండో చైర్మన్..

703 ప్రభుత్వ భూమిని సర్వే చేసిన అధికారులు, పక్కన ఉన్న రైతుల పట్టా భూములను కొలతలు వేసి రైతులకు పట్టాకు ఉండవలసిన భూమిని, రైతుకు కేటాయించి మిగతా భూమిని స్వాధీనం చేసుకొని రైతులకు తగిన న్యాయ చేయాలని తాసిల్దార్ సురేఖను సంజీవరెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఐ బాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, కారోబార్ దాసరి మొగిలయ్య, తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ మోరె గణేష్, మాజీ జెడ్పిటిసి సింగల్ విండో చైర్మన్ పొద్దుటూరి సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.

 

 

ఇంటి కోసం బెస్ట్ వాటర్ హీటర్ వచ్చేసింది!
Bajaj Copper 1000W Immersion Rod Heater
✅ వేగంగా నీళ్లు వేడెక్కే టెక్నాలజీ
✅ యాంటీ-కరోసివ్ నికెల్ ప్లేటింగ్
✅ ISI అప్రూవల్ – భద్రత & నాణ్యత గ్యారంటీ
✅ 2 ఏళ్ల వారంటీ
✅ బ్లాక్/సిల్వర్ కలర్ లో అందుబాటులో ఉంది

ఇంట్లో శీతాకాలం లేదా రోజువారీ వినియోగానికి సరైన ఎంపిక!

అమెజాన్లో బుకింగ్ కోసం https://amzn.to/4eW9PKvలింక్ పై క్లిక్ చేయండి..

️ Clean Brite గార్బేజ్ బ్యాగ్స్ – ఇంటికో శుభ్రత గిఫ్ట్!
బ్లాక్ కలర్, 19×21 ఇంచెస్, HLDP హెవీ ప్లాస్టిక్
డ్రై & వెట్ వేస్ట్‌కు పరిపూర్ణం
✅ 60 బ్యాగ్స్ (30 × 2 రోల్స్)
1 మిలియన్+ హోమ్స్ ట్రస్ట్ చేస్తున్న బ్రాండ్!
అద్భుతమైన డీల్ – కేవలం ₹189 కి (₹1.05/బ్యాగ్)
#SwachhHome #SmartChoice #CleanBrite

అమెజాన్లో కొనుగోలు కోసం లింక్‌పై క్లిక్ చేయండి..https://amzn.to/44wRbVZ

మీరు ఇంకా దోమలతో బాధపడుతున్నారా?
LifeKrafts Magnetic Mosquito Net తో తుమ్మెదలకు గుడ్‌బై చెప్పండి!
ఆటో క్లోజింగ్ మాగ్నెట్, సులభమైన ఇన్‌స్టాలేషన్
️ గాలి ప్రవాహం – దోమల రాకకు చెక్!
స్టైలిష్ & సురక్షితమైన డోర్ మెష్!

అమెజాన్లో కొనుగోలు కోసం https://amzn.to/44w3z8K లింక్ పై క్లిక్ చేయండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *