Thursday , 21 November 2024

‘ధోనీ’కి ఇదే చివరి ఐపీఎల్‌..? కార‌ణాలు ఇవే

ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు మహేంద్రసింగ్‌ ధోని. అయితే 2024 ఐపీఎల్‌ తర్వాత రిటైర్మెంట్‌ ఇవ్వనున్నాడా అంటే అవుననే చెప్తున్నారు క్రికెట్‌ విశ్లేషకులు. ఇది మహి ప్యాన్స్‌ను నిరాశ పరిచే అంశమే అయినా తప్పేట్టుగా కనిపించడం లేదు. ఇలాంటి ప్లేయర్‌ని మళ్లీ చూస్తామో లేదో కానీ ఇదే నిజం. తన ఆట తీరుతో ఒక్క ఇండియాలోనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆట సమయంలో ఆయన ఆలోచన విధానం ఒకే విధంగా ఉండదు. సమయాన్ని బట్టి బౌలింగ్‌, ఫీల్డింగ్‌ల్లో మార్పులు చేస్తూ ఉంటారు. అంతే కాదు మెరుపు వేగంతో స్టంప్‌ చేయడంలో దిట్ట.. చూడకుండా రనౌట్‌ చేయడంఆయ‌న‌కు ఆయ‌నే సాటి. అటు బ్యాంటింగ్‌లోనూ హెలికాప్ట‌ర్ షార్ట్స్ ధోని ఆడిన‌ట్టు ఎవ‌రూ ఆడ‌రు. ఇలాంటి ఆట‌ను మ‌ళ్లీ చూస్తామో లేదో. ధోని లాంటి హెలికాప్ట‌ర్ షాట్స్ చేసేందుకు చాలా మంది ప్లేయర్లు ప్రయత్నించి విఫలమయ్యారు. అది ఒక్క ధోనికే సాధ్యం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇవే కాకుండా ఎన్నెన్ని చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి. ఇలాంటి దిగ్గజ ఆటగాడు ఐపీఎల్‌కు దూరం అవుతున్నాడన్న విషయం తెలిసి ఆయన ఫ్యాన్స్‌కే కాకుండా తాజా, మాజీ ప్లేయర్లు, విశ్లేషకులు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు.

చైనాలో తీవ్ర భూకంపం 116మంది మృతి

ధోనీ ఐపీఎల్‌ ఆగమనం…
2008లో ప్రారంభమైన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సీఎస్‌కే ఆప్షన్స్‌లో ధోనిని రూ. 1.5 మిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. టీమ్‌లో మాథ్యూ హేడెన్‌, మైక్‌ హస్సీ, మురళీధరణ్‌ లాంటి విదేశీ దిగ్గజ ఆటగాళ్లు ఉన్నా కెప్టెన్సీ బాధ్యతలను ధోనికి కట్టబెట్టింది. అయితే మొదటిసారి ఫైనల్స్‌కు చేరినా రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో ఓడిపోయింది. అయితే సీఎస్‌కే ఇప్పటి వరకు నాలుగు సార్లు 2010, 2011, 2018, 2021ల్లో టైటిళ్లను కైవసం చేసుకుంది. అలాగే 9 సార్లు ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. 11 సార్లు ప్లే ఆఫ్‌కు చేరడంలో ధోని మాస్టర్‌ మైండ్‌ గేమే కారణం. ధోని ఐపీఎల్‌ కెరీర్‌లో 234 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 3682 బాల్స్‌ఆడి 4978 పరుగులు చేయగా 346 ఫోర్లు, 229 సిక్సర్లు బాదాడు. అలాగే 300 స్టాంప్‌ అవుట్స్‌ చేశాడు.
ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేందుకు కారణాలు..
ధోని ప్రస్తుతం ఫామ్‌లో లేకున్నా అతను ఆడాలని అభిమానులు కోరుకుంటారు. ధోని క్రీజ్‌లో కనబడితే చాలు అనుకుంటారు. సీఎస్‌కే మ్యాచ్‌ ఉందంటే ఎక్కువ శాతం ధోనీ ఫ్యాన్స్‌ నుంచే టీమ్‌కు మద్దతు లభిస్తుంది. ధోనీకి ఇప్పుడు 41 ఏండ్లు. వయస్సు పై బడటం వల్ల ఇటీవలి కాలంలో ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన తర్వాత ప్రాక్టీస్‌ తక్కువైంది. ఐపీఎల్‌ ఉన్న రెండు నెలలు ఆడి తర్వాత ఏడాది అంతా ప్రాక్టీస్‌ లేకపోవడం వల్ల కూడా బ్యాటింగ్‌ అనుకున్నంత చేయడం లేదని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్న మాట. 2014 ఐపీఎల్‌లో సీఎస్‌కేని విజేతగా నిలబెడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. వేచిచూడాలి మరి ఏం జరుగుతుందో. ఏదిఏమైనా ధోని రిటైర్మెంట్‌ ఇవ్వకూడదని అందరూ చెప్పే మాట.

 

సీరియల్‌ కిల్లర్‌ బృందం అరెస్ట్ వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ సింధుశర్మ

బీఆర్ఎస్ ను బీజేపీకి ‘బీ’ టీమ్‌ అని అందుకే అంటారు కేటీఆర్‌.. కర్ణాటక సీఎం రీ ట్వీట్‌

About Dc Telugu

Check Also

21.11.2024 D.C Telugu Morning News

21.11.2024 D.C Telugu Cinema News

Viral Video

Viral Video” ఒక‌రిని చూసి మ‌రొక‌రు.. కింద‌వ‌డి న‌వ్వుల‌పాలు వీడియో వైర‌ల్

Viral Video” తోటి వ్య‌క్తి తొడ కోసుకుంటే మ‌నం మెడ కొసుకుంటామా అనేది ఓ పాత సామెత‌.. అచ్చం అలాగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com