బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తపై దాడి
ఆసుపత్రిలో మృతి
గోదావరి వాణి,విలేఖరి కోరుట్ల ఆగస్టు 8
కోరుట్ల పట్టణ నడిబొడ్డున చుట్టూ వందలాది మంది ప్రజలు చూస్తుండగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటన కోరుట్లలో మంగళవారం ఉదయం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కోరుట్ల పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, కోరుట్ల 9 వార్డు కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త పోగుల లక్ష్మీరాజం పై గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. లక్ష్మీరాజం కార్గిల్ చౌరస్తా వద్ద గల ఓ హోటల్‌లో వద్ద ఉండగా అక్కడికి వచ్చిన దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో లక్ష్మీరాజంకు ముఖం పై తీవ్ర గాయాలై కాగా స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని స్థానికంగా ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనా స్థలాన్ని కోరుట్ల ఎస్సై కిరణ్ కుమార్ పరిశిలించారు. దాడిపై విచారణ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీరాజం మృతి చెందారు.