papua new newginia” ఎంగా ప్రావిన్స్ పాపువా న్యూగినీలో ఈ నెల 24న ఎంగా ప్రావిన్స్ లోని యంబాలి గ్రామంపై మౌంట్ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. తొలిరోజు సుమారు 100 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు. కానీ.. ఆదివారానికి మృతుల సంఖ్య 670కి చేరినట్లు వెల్లడించారు. తాజాగా.. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 2 వేల మంది సజీవ సమాధి అయినట్లు పాపువా న్యూగినియా దేశ జాతీయ విపత్తు సంస్థ పోర్ట్ మోరెస్బీలో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి తెలిపింది. సుమారు 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొండచరియలు విరిగిపడగా.. ఇళ్లు, పంటలు ధ్వంసమయ్యాయి. 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పకూలాయి. కొండచరియలు విరిగిపడిన సమయంలో ప్రజలు నిద్రలో ఉండటంతో.. పెను ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారు. భవనాలు కుప్పకూలాయి. ఈ విధ్వంసం ఆ దేశ ఆర్థిక జీవనరేఖపై పెను ప్రభావాన్ని చూపింది. అక్కడ పోర్గెరా మైన్ కి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా బ్లాక్ అయినట్లు అధికారులు వెల్లడించారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కూడా ప్రమాదకరంగా ఉందని చెప్పారు. ఘోర విపత్తును ఎదుర్కొన్న తమకు అందరూ సహాయ, సహకారాలు అందించాలని సైన్యం, ప్రజలను కోరింది ప్రభుత్వం. పాపువా న్యూ గినియాలో పరిస్థితి గురించి అంతర్జాతీయంగా అందరికీ తెలిసేలా చెప్పాలని, ఇది ఆదుకోవాల్సిన సమయమని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
remal cyclone” రెమాల్ బీభత్సం.. వణికిపోయిన బెంగాల్ తీరం
Kashmir Real Heros” నిజమైన హీరోలు.. నదిలో కొట్టుకుపోతున్న బాలుడిని కాపాడి యువకులు.. వీడియో వైరల్
vemulawada crime”లంకె బిందేలున్నాయని రూ. 30లక్షలు లక్షలు దోచారు
Hyderabad traffic” హైదరాబాద్ రోడ్లపై కూల్ కూల్
Delhi Metro Viral Video”ఛీ.. ఛీ ఢిల్లీమెట్రోలో ఇదేం పని.. బెల్లీ డ్యాన్స్ వీడియో వైరల్
Road Accident”ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ? ఆర్టీసీ ఎండీ వీడియో ట్వీట్ వైరల్