Helicopter Accidents” హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాల్లో మృతి చెందిన ప్ర‌ముఖులు వీరే.. ఎప్పుడెప్పుడు ఎవ‌రెవ‌రంటే..

Helicopter Accidents

Helicopter Accidents” హెలికాప్ట‌ర్ ప్ర‌మాదాలు చోటుచేసుకున్న సంద‌ర్భాల్లో ప‌లువురు ప్ర‌ముఖులు మృతి చెందిన విష‌యం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఇరాన్ అధ్య‌క్షుడు ఇబ్ర‌హీం రైసీ మృతి చెందారు. అయితే గ‌తంలోనూ చాలా మంది ప్ర‌పంచ‌ స్థాయి నేత‌లు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెందారు. ఇటు మ‌న‌దేశంలోనూ ప్ర‌ముఖ నేత‌లు కొంత‌మంది హెలికాప్ట‌ర్‌ప్ర‌మాదాల్లో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

రామ‌న్ మెగాసెసె పిలిప్పిన్ ఏడో అధ్య‌క్షుడిగా ప‌నిచేస్తూ ఓ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వెళ్తున్న క్ర‌మంలో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో (1957)లో మృతి చెందారు. ఆయ‌న జ్ఞాప‌కార్థం వివిధ రంగాల్లో సేవ‌లందిస్తున్న వారికి ప్ర‌తిష్టాత్మ‌కంగా రామ‌న్ మెగాసెసె అవార్డును అందిస్తున్నారు.
1936 సంవ‌త్స‌రంలో స్వీడ‌న్ ప్ర‌ధాని అర్విడ్ లిండ్‌మాన్‌, 1958లో బ్రెజిల్ అధ్య‌క్షులు రామోస్, 1966లో ఇరాక్ అధ్య‌క్షులు అబ్దుల్ స‌లామ్ ఆరిఫ్‌, 1988లో పాకిస్తాన్ అధ్య‌క్షులు జ‌న‌ర‌ల్ జియా ఉల్ హ‌క్ ప్రాణాలు కోల్పోయారు. 2020వ సంవ‌త్స‌రంలో ప్ర‌ఖ్యాత బాస్కెట్ బాల్ ప్లేయ‌ర్ కోబ్ బ్ర‌యాంట్ కుమార్తెతో పాటు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు.
భార‌త్‌లోనూ… 
తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో చిర‌స్మ‌ర‌ణ నాయ‌కుడిగా నిలిచిపోయిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 2009లో రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హెలికాప్ట‌ర్ వెళ్తున్న క్ర‌మంలో అది క్రాష్ అయి దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన నాయ‌కుడు జీఎంసీ బాల‌యోగి లోక్‌స‌భ స్పీక‌ర్‌గా ఉన్న సంద‌ర్భంలో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలోనే మృతి చెందారు. సినిమా రంగంలో త‌న‌దైన ముద్ర వేసిన ప్ర‌ముఖ న‌టి సౌంద‌ర్య 2004 వ సంవ‌త్స‌రంలో హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలోనే త‌నువు చాలించారు. దివంగ‌త భార‌త ప్ర‌ధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజ‌య్ గాంధీ 1980లో, కాంగ్రెస్ అగ్ర‌నాయకులు మాధ‌వ‌రావు సింధియా (2001)లో విమానం కూల‌డంతో మ‌ర‌ణించారు. భార‌త తొలి సీడీఎస్ బిపిన్ రావాత్ 2021లో ఇదే త‌ర‌హా ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

ఇవి కూడా చ‌ద‌వండి

Vice-Chancellors”యూనివ‌ర్సీటిల‌కు ఇన్ చార్జీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్లు నియామ‌కం

Karnataka Bus Accident” ఫ్లైఓవర్ పై రెయిలింగ్‌ను గుద్ది వేలాడిన‌ బ‌స్సు..

Viral video” న‌డిరోడ్డుపై అంటుకున్న బైక్..కూల్ డ్రింక్‌తో చ‌ల్లార్చిన యువ‌కుడు..వీడియో వైర‌ల్

Serial Actor”త్రినయిని సీరియల్ నటుడు చందు ఆత్మహత్య

Old Courtallam Falls Flood” జ‌ల‌పాతం వ‌ద్ద ఆక‌స్మికంగా పెరిగిన వ‌ర‌ద‌… బాలుడు మిస్సింగ్‌.. వీడియో

Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభ‌త్సం.. కూలిన హోర్డింగ్‌.. వీడియోలు వైర‌ల్

Latest Viral Video” కూల‌రా..? ఏసీనా…? అస‌లు ఎక్కడినుంచి వ‌స్త‌యి ఈ ఐడియాలు వీడియో వైర‌ల్

Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండ‌వేడికి పెట్రోల్ బంక్ ఓన‌ర్ కిరాక్ ఉపాయం..వీడియో వైర‌ల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *