Fertilizer” పీవోఎస్ మిషన్‌ ద్వారానే విక్రయాలు జరగాలి: డీలర్లకు ఏడీఏ శ్రీధర్ సూచనలు

తేదీ: మే 30, 2025
ప్రాంతం: శంకరపట్నం, కరీంనగర్ జిల్లా
రిపోర్ట్: డిసీ ప్రతినిధి


ప్రభుత్వ ఆదేశాల మేరకు పీవోఎస్ (POS) మిషన్‌ ద్వారా మాత్రమే ఎరువులు, విత్తనాలు, క్రిమిసంరక మందులు విక్రయించాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీఏ) శ్రీధర్ డీలర్లకు స్పష్టం చేశారు.

శుక్రవారం శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామ రైతు వేదిక వద్ద నిర్వహించిన డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.


ఈ సమావేశంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేష్ ఆధ్వర్యంలో
తాడికల్, మెట్టుపల్లి, గద్దపాక ప్రాంతాల సహకార సంఘాల సీఈఓలు, అన్ని గ్రామాల ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏడీఏ శ్రీధర్ మాట్లాడుతూ:

ప్రతి విక్రయదారుడు పీఓఎస్ మిషన్‌లో రైతు వివరాలు నమోదు చేసి, ఎరువులు & విత్తనాల విక్రయాన్ని రసీదు సహితంగా ఇవ్వాలి. నాణ్యమైన ఉత్పత్తులు విక్రయించి రైతులకు నష్టం కలగకుండా చూడాలి,” అన్నారు.


లైసెన్సు రద్దు, క్రిమినల్ కేసుల హెచ్చరిక..

ప్రభుత్వ మార్గదర్శకాలు ఉల్లంఘించిన డీలర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

“విక్రయాల రిజిస్టర్లు, కొనుగోలు వివరాలు ప్రతి డీలరు నిఖార్సైనంగా నమోదు చేసి ఉంచాలి.
ఆకస్మిక తనిఖీల్లో అధికారులు వాటిని పరిశీలిస్తారు,” అని తెలిపారు.

చట్టాన్ని అతిక్రమించే డీలర్లపై:

  • లైసెన్సు రద్దు

  • క్రిమినల్ కేసులు నమోదు
    చేయబడతాయని స్పష్టం చేశారు.


సమావేశంలో పాల్గొన్న వారు

  • మండల వ్యవసాయ అధికారి వెంకటేష్

  • ఏఈఓ రాజకుమార్

  • సహకార సంఘాల సీఈఓలు

  •   డీలర్లు 

  • ఇటువంటి చిన్న చిన్న ప్ర‌క‌ట‌న‌ల‌కు సంప్ర‌దించండి.. tholivartha1@gmail.com యాడ్ వివ‌రాల‌ను మెయిల్ చేయండి.. త‌క్కువ ధ‌ర‌లోనే ప్రచురిస్తాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *