Indiramma Illu”పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: టీపీసీసీ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్

తేదీ: మే 30, 2025
ప్రాంతం: శంకరపట్నం, కరీంనగర్ జిల్లా
రిపోర్ట్: డిసీ ప్రతినిధి


తెలంగాణ రాష్ట్రంలో పేదల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తగిన నిబద్ధతతో పనిచేస్తోందని టీపీసీసీ సభ్యుడు, శంకరపట్నం మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్  అన్నారు.

శుక్రవారం మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం, మొలంగూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ  కార్య‌క్ర‌మానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.


కాంగ్రెస్ హయాంలోనే పేదలకు ఇళ్ల కల నెరవేరింది

ఈ సందర్భంగా   శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలోనూ, ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ పేదలకు ఇంటి కలను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే,” అని పేర్కొన్నారు.

 బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లలో ఒక్క ఇంటి పథకం సరిగా అమలు చేయలేదని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల లోపే పలు సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు.


ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు గౌరవమైన జీవితం

ఇల్లులేని వారికి గౌరవమైన నివాసం కల్పించేందుకు ఇళ్ల నిర్మాణానికి మంజూరు పత్రాలు అందజేయడం – కాంగ్రెస్ పాలనకు నిదర్శనం,” శ్రీనివాస్ గౌడ్  అని  పేర్కొన్నారు.
ప్రజా పాలనలో ప్రజల సమస్యలపై స్పందించే ప్రభుత్వం  అని అని స్పష్టం చేశారు.


తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు: పిలుపు

 “కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను దారి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల పథకాన్ని అందజేస్తోంది. ప్రజలు అటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మరాదు,” అని ప్రజలకు సూచించారు.


కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:

  • కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నేరెళ్ల సంతోష్ కుమార్

  • సీనియర్ నాయకులు చీకట్ల కుమారస్వామి, నూనె కనక రాజ్యం, రాజయ్య

  • యూత్ నాయకులు బోగస్ శ్రీకాంత్

  • అనేకమంది కార్యకర్తలు, లబ్ధిదారులు


ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో పంచుకోండి. మరిన్ని ప్రాంతీయ మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల వార్తల కోసం మాతో పాటు ఉండండి. 

ఇటువంటి చిన్న చిన్న ప్ర‌క‌ట‌న‌ల‌కు సంప్ర‌దించండి.. tholivartha1@gmail.com యాడ్ వివ‌రాల‌ను మెయిల్ చేయండి.. త‌క్కువ ధ‌ర‌లోనే ప్రచురిస్తాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *