వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు డివైడర్ ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలో కారు లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే… సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణం నోవోపాన్ సవిూపంలో జాతీయ రహదారి పై రోడ్ సోమవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. స్కూటీ పై వెళ్తున్న ముగ్గురు విద్యార్థులు డివైడర్‌ను ఢీ కొట్టారు. ఆర్. భరత్ చందర్ (19) పి.నితిన్, (18) అక్కడిక్కడే మృతి చెందారు. ఎ.వంశీ (19) తీవ్రగాయపడ్డాడు. వంశీని చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వీరు సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సూర్యాపేట జిల్లాలో హైటెక్ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి వద్ద ముందుగా వెళ్తున్న లారీని అతివేగంగా వచ్చిన కారు వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర గాయాపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.